1 dead after 7 were shot in Maryland, police say మేరీల్యాండ్ లో కాల్పుల కలకలం.. పరారీలో అగంతకుడు

Police 8 shot 1 fatally in latest baltimore shooting

Michael Harrison, Jack Young, Baltimore, Baltimore Shooting, maryland shooting, maryland, america shooting, US shooting, Crime

Seven people were shot in Baltimore, US state of Maryland, on Sunday afternoon, with one of them dead, according to media reports. The shooting took place during a cookout near a church in West Baltimore

మేరీల్యాండ్ లో కాల్పుల కలకలం.. పరారీలో అగంతకుడు

Posted: 04/29/2019 02:20 PM IST
Police 8 shot 1 fatally in latest baltimore shooting

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మేరీల్యాండ్‌ రాష్ట్రంలోని వెస్ట్ బాల్టిమోర్ లో ఓ సాయుధ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ఏడుగురు భక్తులు కాల్పుల ఘటనలో గాయాలపాలయ్యారు. బాల్టిమోర్ లోని పశ్చిమ ప్రాంతంలోగల ప్రార్థనా మందిరం వద్ద మధ్యాహ్నం బోజనాల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆరు బయట భోజనాల కోసం గూమిగూడిన జనంపైకి ఓ సాయుధ అగంతకుడు కాల్పులు జరిపాడు.

కాగా, రెండు చోట్ల తూటాలు కనిపించడంతో ఇద్దరు సాయుధులు కాల్పులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల్లో స్థానిక చర్చి వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందినగా, మరో ఏడుగురు వ్యక్తలు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అగంతకులు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. అయితే ఈ కాల్పులకు తెగబడిందెవరు.? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగిరం చేశారు. అగంతకుల కోసం అన్వేషణ కూడా ప్రారంభించారు.

ఘటనాస్థలంలోని సీసీటీపీ ఫూటేజీలను కూడా పరిశీలిస్తున్న పోలీసులు అగంతకులను త్వరలోనే పట్టకుంటామని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం పిట్స్ బర్గ్ లోని యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ సాయుధుడు చొరబడి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే నలుగురు పోలీసులు సహా ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా గాయపడ్డాడు. కాగా, ఆదివారం కాలిఫోర్నియాలోని యూదుల ప్రార్థనా మందిరంలోకి చొరబడిన ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. నలుగురు గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles