'Govt trying to wash hands of Telangana Inter results fiasco' ఇంటర్ బోర్డు ముట్టడికి విపక్షాల యత్నం.. నేతల హౌజ్ అరెస్టులు

Praja front leaders house arrests in telangana on intermiediate results fisaco

Praja Front leaders house arrests, Praja Front on Intermiediate students suicide, Praja Front inter students parents agitation, Praja Front on intermiediate board officials, Praja Front CM KCR, Praja Front Inter marks goof-up, Praja Front leaders Intermiediate results, Praja Front leaders on Globarena, Praja Front on interboard failure, Praja Front, Intermiediate board, arrests, students suicides, CM KCR, Inter marks goof -up, Globarena, Telangana, politics

Praja Front leaders house arrests in Telangana, on Intermiediate results fisaco, after the leaders unitedly gave a call to protested at Telangana Intermiediate Board. The leaders comdemn the illegal arrests and demands for justification to Inter students.

ఇంటర్ బోర్డు ముట్టడికి విపక్షాల యత్నం.. నేతల హౌజ్ అరెస్టులు

Posted: 04/29/2019 12:41 PM IST
Praja front leaders house arrests in telangana on intermiediate results fisaco

తెలంగాణ ఇంటర్ బోర్డు మునుపెన్నడూ లేని విధంగా ఇంటర్ బోర్డులో పెద్దఎత్తున్న అవకతవకలు జరిగాయి. ఇంటర్ విద్యార్ధుల జీవితాలతో బోర్డు అధికారులు చెలగాటం అడుటంతో ఇప్పటికే 20 మందికి పైగా విద్యార్థులు బలవంతంగా తనవు చాలించుకున్నారు. ఈ వ్యవహారంలో యావత్ రాష్ట్ర విద్యార్థి లోకం భగ్గుమంటోంది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకుని తీవ్రస్థాయిలో వరుసగా నిరసనలు, అందోళన కార్యక్రమాలకు నిర్వహిస్తున్నారు. వీరికి అండగా నిలిచిన రాష్ట్ర విపక్ష రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ఇవాళ ఇంటర్ బోర్డు ముట్టడికి పిలుపునివ్వడంతో.. విపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్భందం చేశారు.

విపక్షాల అఖిలపక్షం ‘చలో ఇంటర్మీడియట్‌ బోర్డు’ పేరుతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఎలాగైన విఫలం చేయాలని ప్రభుత్వాదేశాలతో పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా గృహనిర్భంధం చేశారు. తమ తమ ఇళ్లను దాటి బయటకు వచ్చిన విపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ, సీపీఐ నేతలనూ అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు బయలుదేరగానే ఆయన్ను పోలీసులు నిర్బంధించారు. పొన్నం ప్రభాకర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

మేడ్చల్ లో కూన శ్రీశైలం గౌడ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేయాలని భావిస్తున్న వారిపై టీఆర్ఎస్ సర్కారు దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. అరెస్ట్ లు ప్రజాస్వామ్యానికి విఘాతమని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి గీతారెడ్డి ఇంటర్ బోర్డు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించగా అమెను కూడా పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేశారు. తెలంగాణ బిడ్డలకు జరిగిన అన్యాయం పట్ల అవేధన వ్యక్తం చేసే కేటీఆర్.. నిజంగా అంతటి మానవత్వం వుంటే.. బోర్డు అధికారులను నిలదీయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బోర్డు ముట్టడికి బయలుదేరిన ఆయనను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు తీరుపై తీవ్రంగా మండిపడ్డ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడని, ఆయన వాయిస్ కు డిమాండ్ అధికమని, ఆయన వచ్చి నష్టపోయిన విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. గ్లోబరినా సంస్థకు కేటీఆర్ కు సంబంధం ఉందని ఆరోపించిన పొన్నం, విద్యామంత్రితో రాజీనామా చేయించాలని, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అన్నారు. బోర్డు సెక్రటరీపై, గ్లోబరినాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ఇంటర్ బోర్డు ముట్టడిలో భాగంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డిని అదుపులోకి తీసుకుని నారాయణగూడ పీఎస్ కు తరలించారు. మరోవైపు ఇంటర్ బోర్డును ముట్టడించిన వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు, సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాల నేపథ్యంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పు జరిగిందని ప్రభుత్వమే ఒప్పుకుందని గుర్తు చేశారు. జరిగిన తప్పును సరిదిద్దాలని తాము కోరుతున్నామని అన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకోలేదు కాబట్టే, తాము ధర్నాకు పిలుపునిచ్చామని అన్నారు. అప్రజాస్వామికంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles