Cyclone predicted in Tamil Nadu, Andhra coast పెను తుపానుగా మారనున్న ‘ఫణి’.. హెచ్చిరికలు జారీ..

Imd issues cyclonic storm warning in andhra tamil nadu puducherry

IMD, Andhra cyclone alert, TN cyclone alert, cyclone alert tn, IMD cyclone alert, Andhra storm, tn storm, puducherry storm, pondicherry weather, pondicherry storm alert, Andhra Pradesh, Politics

India Meteorological Department (IMD) has issued cyclonic storm warning for the states of Andhra Pradesh, Tamil Nadu and coastal areas and warned fishermen from venturing out in open seas.

పెను తుపానుగా మారనున్న ‘ఫణి’.. హెచ్చిరికలు జారీ..

Posted: 04/27/2019 01:36 PM IST
Imd issues cyclonic storm warning in andhra tamil nadu puducherry

పండు వేసవిలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలాన్ని పుంజుకుని పెను తుఫానుగా మారి తీరందాటే అవకాశాలు వున్నాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుద్దుచేరిలలో ఇది తీరం దాటే అవకాశాలు వున్నాయని, దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను అప్రమత్తం చేసిన వాతావరణ కేంద్రం.. ప్రభావిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది. ముంపు ప్రాంతాలలోని ప్రజలను తక్షణం అప్రమత్తం చేయాల్సిందిగా కూడా సూచించింది.

నాలుగు రోజుల క్రింత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ మరుసటి రోజునే వాయుగుండంగా మారింది. భారత దక్షిణ తీరం వైపు కదులుతూ ఇవాళ ఉదయం తీవ్ర వాయుగుండంగా మారింది. సాయంత్రానికి అది మరింత తీవ్రం కానున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. 29వ తేదీ నాటికి ఇది మరింత బలపడి 30వ తేదీ నాటికల్లా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, అది దిశను కూడా మార్చుకునే అవకాశాలున్నాయని వివరించింది. కోస్తాంధ్ర తీరం వెంబడి ఇది ప్రయాణించే అవకాశాలు ఉన్నప్పటికీ ఏపీ తీరం తాకే అవకాశాలు లేవని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

మచిలీపట్టణానికి 1690 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని ట్రింకోమలికి 1060 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 1410 కిలోమీట్ల దూరంలో  వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్న అధికారులు ఈ ఉదయం అది తీవ్ర వాయుగుండంగా మారి, 5:30 గంటల ప్రాంతంలో తుపానుగా మారినట్టు తెలిపారు. 29న అది తీవ్ర తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో 30న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.  నేటి నుంచి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీరాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ తుపానుకు ‘ఫణి’ అని పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. తుపాను నేపథ్యంలో జాలర్లు వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు ఆదివారం లోగా తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles