HC rejects subramanian swamy plea on audit of TTD Expences టీటీడీ వ్యయాలపై ఆడిటింగ్ పిటీషన్.. తోసిపుచ్చిన హైకోర్టు..

Hc rejects subramanian swamy plea on audit of ttd expences

HC rejects subramanian swamy plea, HC rejects subramanian swamy plea on audit of TTD Expences, HC rejects plea on audit of TTD Expences, TTD, Tirumala Tirupati Devasthanam, subramanian swamy, AP High Court, audit on TTD Expences, andhra pradesh, politics, andhra pradesh, politics

Andhra Pradesh High Court Rejects BJP Leader and Rajya sabha MP subramanian swamy plea on audit of TTD Expences

టీటీడీ వ్యయాలపై ఆడిటింగ్ పిటీషన్.. తోసిపుచ్చిన హైకోర్టు..

Posted: 04/27/2019 02:02 PM IST
Hc rejects subramanian swamy plea on audit of ttd expences

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంపై అంధ్రప్రదేశ్ ప్రభుత్వ అజమాయిషీ నుంచి విమక్తి కల్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసి చేతులు కాల్చుకున్న బీజేపి నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి.. తాజాగా మరో పిటీషన్ దాఖలు చేశారు. గత మూడేళ్లలో టీటీడీకి చెందిన ఖర్చులపై బయటి వ్యక్తులతో ఆడిట్ నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన పిటీషన్ ను తోసిపుచ్చింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే, వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు సూచన మేరకు ఆయన దాఖలు చేసిన టీటీడీ సహా మరో 11 దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ నుంచి విముక్తి కల్పించాలన్న ప్రధాన వ్యాజ్యంపై తుది విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఈ వ్యాజ్యం వేసవి సెలవులపై విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

టీటీడీ, తిరుచానూరు పద్మావతి దేవితో పాటు మరో 11 ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి, ఢిల్లీకి చెందిన సత్యపాల్‌ సభర్వాల్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆలయాలపై ప్రభుత్వానికి అధికారాన్ని కల్పించే హిందూ ధార్మిక సంస్థల, దేవాదాయ చట్టంలోని పలు సెక్షన్లను రద్దు చేయాలని వీరు కోరారు. కాగా ఈ పిటీషన్ ను విచారించిన ధర్మాసనం టీటీడీ స్థానిక చట్టాల ఆధారంగా పనిచేస్తోంది కాబట్టి ..ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles