SC issues notice to Centre, EC on plea for contempt ఎన్నికల కమీషన్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Sc issues notice to centre ec on contempt plea for alleged violation of its order

Supreme Court, Ashwini Kumar Upadhyay, general election, criminal candidates, Justice R F Nariman, Justice Vineet Saran, lok sabha election, candidates affidavit, election commission, supreme court, national Politics, contestants criminal nature, criminal cases, contempt of court, crime

The Supreme Court on Friday issued notice to the Centre and the EC on a plea seeking initiation of contempt proceedings for alleged violation of the apex court's judgment directing all candidates to declare their criminal antecedents before contesting elections.

అభ్యర్థుల నేరచరిత్రపై ఈసీ, కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు

Posted: 03/29/2019 02:39 PM IST
Sc issues notice to centre ec on contempt plea for alleged violation of its order

ఎన్నికలలో పాల్గొంటున్న అభ్యర్థుల నేరచరిత్ర విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా కేంద్ర ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన  అదేశాలను పాటించకుండా కోర్టు ధీక్కారానికి పాల్పడుతున్నారని మండిపడిన అత్యున్నత న్యాయస్థానం నోటీసులను జారీ చేసి.. వాటిపై బదులివ్వాలని అదేశించింది. దేశంలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను ఎందుకు దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నిలదీసింది.

నేరచరిత్ర వున్న అభ్యర్థులు అటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినా.. లేక ఇటు లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచినా.. ఆయా వివరాలను పత్రికలు, టీవీల్లో విస్తృతంగా ప్రచురించేలా చేయాలని గతేడాది ఐదుగురు సభ్యులు గల సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఎన్నికల కమీషన్ అమలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఇప్పటివరకూ ఈసీ తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఎన్నికలలో పోటీ చేస్తున్న నేరచరిత్ర గల అభ్యర్థుల వివరాలపై అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించి.. దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ సారన్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య న్యాయస్థాన ధర్మాసనం.. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు ఎన్నికల కమీషన్ కు నోటీసులు జారీ చేసింది. కాగా, తమపై ఉన్న కేసుల వివరాలను అభ్యర్థులు తెలుపలేదని ఈసీ వాదనలు ఈసీ వినిపించింది. అభ్యర్థులు ఎవరూ తమ నేరచరిత్రపై మీడియాలో ప్రచురించలేదని వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో తమ ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఈసీ ఈ విషయమై సానుకూలంగా స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ధిక్కరణ నోటీసులు జారీచేసింది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారిపై నమోదైన కేసుల వివరాలను పత్రికలు, టీవీలు, వెబ్ సైట్లలో ప్రచురించడంపై వారం రోజుల్లోగా జవాబు ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. ఆతర్వాత తాము తీసుకునే చర్యలకు సైతం సిద్ధంగా ఉండాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles