pregnant woman attacked by Ycp party sympathiser జనసేనకు ఓటేస్తామన్న నిండు గర్భణిపై దాడి..

Janasena sympathiser pregnant woman attacked in visakha by ycp party leader

pawan kalyan, janasena, gajuwaka, sidhu, nagamani, visakha steel plant employee, nageshwara rao, pedagantyada, nellimukku, pitta veedhi, YSRCP sympathiser, Janasena sympathiser, gajuwaka assembly constituency, visakhapatnam, andhra pradesh, politics

House owner created ruckus and thrown out tenants in the midnight for saying they are fans of pawan kalyan and prefer their vote to his Janasena party. The panic situation is the tenant lady is 9 months pregnant. This incident took place in gajuwaka of viskhapatnam.

జనసేనకు ఓటేస్తామన్న నిండు గర్భణిపై దాడి..

Posted: 03/29/2019 01:33 PM IST
Janasena sympathiser pregnant woman attacked in visakha by ycp party leader

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకి ఎవరు ఓటు వేస్తున్నారన్న విషయం తెలియకుండా రహస్య ఓటు పద్దతిని తీసుకువచ్చింది భారత రాజ్యాంగం. అయితే పార్టీల సానుభూతి పరులు మాత్రం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గోని ఓట్లను అభ్యర్థించే పరిస్థితి పోయి.. ప్రత్యర్థి పార్టీల కీలక నేతలపై దాడులు ప్రతిదాడుల వరకు చేరుకుంది. అంతటితో ఆగకుండా అధిపత్యం కోసం నేతలు చేస్తున్న రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించాయి.

ఇక ఇవి నాయకుల నుంచి కార్యకర్తలకు కూడా పాకి తృతీయశ్రేణి నాయకులుగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో వారి అగడాలు మరింతగా శృతిమించిపోతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి రాజకీయాల నుంచి మార్పు దిశగా తీసుకెళ్తానని ప్రచారం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అకర్షితులైన ఓ కుటుంబం.. ఆయనకు ఓటేస్తామని చెప్పడంతో.. వైసిపీ పార్టీ సానుభూతిపరుడైన ఇంటి యజమాని వారినిపై అర్థరాత్రి దౌర్జన్యం చేశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా అర్థరాత్రి పీకలదాకా తాగోచ్చి వారిని తన ఇంట్లోంచి గెంటేసి.. తాళం వేసి.. దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరించాడు.

విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతంలోని పిట్టవీధికి చెందిన ఎన్.నాగమణి-సిద్ధు దంపతులు. వీరికి మూడేళ్ల పాప ఉండగా, నాగమణి ప్రస్తుతం నిండు గర్భిణి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అయిన నాగేశ్వరరావు ఇంట్లో వీరు మూడేళ్లుగా అద్దెకుంటున్నారు. ఇటీవల ఇంటి యజమాని వారి వద్దకు వచ్చి వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారానికి రావాలని, ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తానని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు. తన భార్య నిండు గర్భిణి కావడంతో రాలేమని సిద్దూ చెప్పాడు. అయినా, తాము పవన్ అభిమానులమని, ప్రచారానికి రాలేమని చెప్పారు.

వారు అలా చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాగేశ్వరరావు వారితో గొడవపడ్డాడు. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. తమకు కొంత సమయం కావాలని మొత్తుకున్నా వినిపించుకోలేదు. రాత్రి నాగేశ్వరరావు, వారి బంధువులు తాగి వచ్చి మరోమారు గొడవ పడ్డారు. నాగమణి జుట్టుపట్టుకుని బయటకు తోసేశారు. దీంతో ఆమె ఇనుప గ్రిల్ తగిలి కిందపడిపోయింది. దంపతులు ఇద్దరినీ బయటకు లాగేసి ఇంటికి తాళం వేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  janasena sympathisers  sidhu  nagamani  nageshwara rao  gajuwaka  andhra pradesh  politics  

Other Articles