harirama jogaiah critisizes ycp parliamnet candidate నర్సాపురం ఓటర్లకు మాజీ మంత్రి బహిరంగ లేఖ..

Former minister hari rama jogaiah open letter to narsapuram parliament voters

Hari Rama Jogaiah open letter to narsapuram parliament voters, Hari Rama Jogaiah open letter to voters, MP candidate, Hari Rama Jogaiah, Raghurama Krishnam Raju, Nagendra Babu, Narsapuram parliament, west godavari, Andhra Pradesh, Politics

Former Minister Hari Rama Jogaiah issues an open letter to narsapuram parliament voters appealing them not to chose a YSRCP candidate Raghurama Krishnam Raju a businessman as their representative.

నర్సాపురం ఓటర్లకు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ..

Posted: 03/28/2019 04:15 PM IST
Former minister hari rama jogaiah open letter to narsapuram parliament voters

నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నర్సాపురం ఓటర్లు విజ్ఞులని కీర్తిస్తునే.. వారికి ఓ సూచన చేశారు హరిరామ జోగయ్య. మీ అమూల్యమైన ఓటు ఎవరికైనా వేసుకోండి కానీ అంటూనే మెలికపెట్టిన హరిరామజోగయ్య.. వైసీపీ అభ్యర్ధి రఘు రామకృష్ణం రాజు మాత్రం ఓటు వేయవద్దని సూచించారు. అందుకు గల కారణాలను కూడా ఆయన తన బహిరంగ లేఖలో వివరించారు.

ఈ మాజీ మంత్రి విడుదల చేసిన బహిరంగ ప్రకటన రాజకీయవర్గాల్లో అలజడి సృష్టిస్తోంది. తన అధికారిక లెటర్ హెడ్ పై హరిరామ జోగయ్య రఘురామకృష్ణంరాజు చరిత్ర అందరికీ తెలియాలనేది ఈ ప్రకటనలో ప్రస్తావించిన విషయం. రఘురామ పక్కా వ్యాపారి అనీ, తన వ్యాపారాలను చక్కదిద్దుకోవడమే ధ్యేయంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యలను తీర్చడానికి కాదని జోగయ్య పేర్కొన్నారు. ప్రస్తుతానికి రఘురామ ఆస్తులు వేలం వేస్తున్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. వాటి నుండి తప్పించుకోవడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు.

కేవలం కోడి పందాలు, వ్యాపారాలు చూసుకుంటూ తన ఆస్తులను పరిరక్షించుకునేందుకు మాత్రం ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నారని అరోపించారు. అంతేకాదు నేరచరిత్ర కలిగిన కుటుంబం నేపథ్యం వున్న వ్యక్తిని చట్టసభకు ఎన్నుకునే ముందు ప్రతీ ఓటరు ఓ సారి అలోచించాలని ఆయన కోరారు. ప్రతి సంవత్సరం సుప్రీంకోర్టుకు వెళ్లి కోడిపందాలు ఆడించి అనేక మంది పొట్ట కొడుతున్నాది రఘురామరాజు కాదా అంటూ జోగయ్య తన లేఖలో ప్రశ్నించారు. వంగవీటి మోహనరంగా హత్యలో చంద్రబాబుతో పాటు సిరీస్ సుబ్బరాజు ప్రమేయం ఉందని ఆనాడే తాను రాసిన పుస్తకంలో చెప్పినట్లు గుర్తు చేశారు.

క్రిమినల్ చరిత్ర ఉన్న సిరీస్ సుబ్బరాజు కూతురు కొడుకు రఘు రామకృష్ణం రాజును పార్లమెంటు సభ్యుడుగా పంపాల్సిన అవసరం ఉందా అన్న విషయాన్ని ప్రజలు ఆలోంచించాలని హరిరామ జోగయ్య కోరారు. ఈ లేఖ ఎందుకు రాశారనేది పక్కన పెడితే ఇలా ఒక ఎంపీ అభ్యర్ధి గురించి ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదని మరో మాజీ ఎంపీ బహిరంగంగా ప్రకటించడం మాత్రం నియోజక వర్గ ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. ఇది ఏ పక్షానికి మేలు చేయనున్నదన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles