pawan kalyan promises 3 lakh jobs యువతకు, రైతులకు పవన్ గుడ్ న్యూస్..

Pawan kalyan promises 3 lakh jobs to ap youth in 6 months

pawan kalyan, janasena, Pawan Kalyan Youth, Pawan Kalyan farmers pension, JanaSena LPG gas cylinders, Janasena Ysrcp, pawan kalyan jagan, pawan kalyan jagan farooq abdullah charge, andhra pradesh, politics

Jana Sena Party chief Pawan Kalyan said TDP fears YSR Congress Party will take away its leaders and the Chief Minister has lost control of his MLAs. He announced that Jana Sena was the right force to counter the goondaism of Jaganmohan Reddy.

అధికారంలోకి వచ్చిన వెంటనే 3 లక్షల ఉద్యోగాలు: పవన్

Posted: 03/28/2019 03:24 PM IST
Pawan kalyan promises 3 lakh jobs to ap youth in 6 months

జనసేన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలలోపే రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతీ రైతుకు నెలకు రూ. 5 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కొత్త యువ రైతులను తయారు చేయాలనే బలమైన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. భూములిచ్చి లక్షమంది యువ రైతులను తయారు చేస్తానని హామీ ఇచ్చారు. తన లాగా పదో తరగతి చదివితే చాలన్నారు. యాక్టర్ కంటే ముందు తాను రైతునన్నారు. లాండ్ ఆండ్ ఆర్డర్ కోసం 25 వేల పోలీసు పోస్టులను భర్తీ చేస్తానని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో తనను టార్గెట్ చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ను అంతే ధీటుగా ఎదుర్కోంటూ కౌంటర్ ఇస్తున్నాడు పవన్. చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... జగన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. శాసనసభకు వెళ్లని ప్రతిపక్ష నేత మనకు అవసరమా అని ప్రశ్నించారు. టీడీపీకి వైసీపీ నేతలంటే భయం అని వ్యాఖ్యానించిన పవన్... వైసీపీని ఎదుర్కోవాలంటే జనసేనే కరెక్ట్ అని కామెంట్ చేశారు. ఏ పార్టీలో అయిన పెట్టుకోవాలనుకుంటే బహిరంగంగానే ఆ పని చేస్తానన్న జనసేనాని... జగన్ తరహాలో దొడ్డిదారిన మోదీ కాళ్లు పట్టుకోనని ఎద్దేవా చేశారు.

అడ్డగోలుగా లక్షల కోట్లు దోచుకుంటున్న నేతలు ఇవాళ తామే నిజయితీకి కేరాఫ్ అడ్రస్ గా ఉదహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఎవడబ్బ సొమ్మని కోటాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ కు పెన్షన్ వస్తుందని...అందరికీ అన్నం పెట్టే రైతుకు పెన్షన్ రాదని వాపోయారు. ఆడ పిల్లలకు ఎల్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.10లక్షల బీమా పథకాన్ని వర్తింప చేస్తానని చెప్పారు.

రాష్ట్రంలో ఆదాయంతో నిమిత్తం లేకుండా వైట్ కార్డు, పింక్ కార్డుతో నిమిత్తం లేకుండా, డబ్చు ఉన్నా లేకున్నా ప్రతి కుటుంబానికి ఉచితంగా పది గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయిస్తానని తెలిపారు. తక్కువ మంది కుటుంబ సభ్యులుంటే ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు. ఇప్పుడిస్తున్న రేషన్ బియ్యం తినడానికి పనికి రావని అందుకనే తమ పార్టీ అధికారంలోకి వస్తే.. పేదలకు బియ్యం బుదలుగా నగదును అందిస్తామని హామీ ఇచ్చారు. తాను ఒక మాట ఇస్తే.. అదే మీద నిలబడుతానని స్పష్టం చేశారు.

సైకిల్ పాతబడిపోయిందన్న పవన్... కేసీఆర్ ఎప్పుడో సైకిల్ చైన్ తెంపారని కామెంట్ చేశారు. టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఏపీలో రాజకీయాలు కేవలం రెండు కుటుంబాలు మాత్రమే చేయాలా అని ప్రశ్నించారు. తాము సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో కలిసి పోటీ చేస్తున్నామని.. వైసీపీ లాగా బీజేపీతో చీకటి ఒప్పందాలను చేసుకోలేదని.. ప్రత్యేకహోదాను కల్పించని పార్టీని భుజాల మీదికి ఎక్కించుకోలేదన్నారు. తాము సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  youth employment  farmers pension  Jagan  YSRCP  andhra pradesh  politics  

Other Articles