PM Modi badgers SP-BSP alliance in UP బ్యాంకు ఖాతాలే ఇవ్వనివారు.. డబ్బులెస్తారా.?: మోడీ సెటైర్..

Surgical strikes on land sky and space says pm modi at meerut rally

prime minister narendra modi, pm modi kick starts election campaign, modi attacks rahul gandhi, modi on surgical strikes, modi opposition sharab, modi mirage, modi on congress minimum income programe, modi sharab, modi sarab, akhilesh yadav, modi rally, modi meerut rally, uttar pradesh, pm modi rally, modi up rally, modi in meerut, meerut, modi, modi report card, national politics

PM Modi referred to the Opposition in Uttar Pradesh as 'sarab', a new acronym he coined at the Meerut election rally. This set the Opposition fuming who pulled up PM Modi accusing him of taking the rhetoric to a new low.

బ్యాంకు ఖాతాలే ఇవ్వనివారు.. డబ్బులెస్తారా.?: మోడీ సెటైర్..

Posted: 03/28/2019 05:05 PM IST
Surgical strikes on land sky and space says pm modi at meerut rally

కాంగ్రెస్ నగదు బదిలీ పథకంపై ప్రధాని మోడీ టార్గెట్ చేశారు. ఆయన తొలి బీజేపి బహిరంగసభలోనే కాంగ్రెస్ నగదు బదిలీ పథకంపై విరుచుకుపడ్డారు. 70 ఏళ్ల పాలనలో పేదవాడి పేరుతో బ్యాంకు అకౌంట్ కూడా తెరిపించలేని కాంగ్రెస్.. ఇప్పుడు డబ్బులు ఎలా వేస్తారని ప్రధాని మోడీ ప్రశ్నించారు. కనీసం పేదవాడి పేరుతో బ్యాంకు ఖాతా కూడా తెరిపించలేని వాళ్లు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. భారత్ ను స్పేస్ పవర్ గా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ నుంచి తన ఎన్నికల ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. తొలి ఎన్నికల సభలోనే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన ''ప్రతి పేదవాడికి కనీస ఆదాయం' పథకంపై ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మాటలు తనకు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. మేము ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లో వాళ్లు డబ్బు వేస్తారంట.. అని మోడీ సెటైర్లు వేశారు.బీజేపీ హయాంలో దేశంలోని ప్రతి ఒక్కరు అభివృద్ధి ఫలాలను ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు.

బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి మీదే కాదు అంతరిక్షంలోనూ సర్జికల్ స్ట్రయిక్స్ చేసి చూపించామన్నారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్ ర్యాంక్-వన్ పెన్షన్ తాము నెరవేర్చామన్నారు. జన్ ధన్ యోజన కింద 34 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచామని వెల్లడించారు. దేశంలో ప్రతి ఒక్కరు గౌరవప్రదంగా జీవించాలన్నదే తమ లక్ష్యం అని మోడీ చెప్పారు. త్వరలోనే అందరి లెక్కలు తేలుస్తా అన్నారు. ఇటువైపు నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది.. అటువైపు ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిన వారున్నారు అని కాంగ్రెస్ ను ఉద్దేశించి మోడీ విమర్శించారు. మా విజన్ నవ భారత నిర్మాణం అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  narendra modi  rahul gandhi  congress  mimimum income scheme  national politics  

Other Articles