Pawan kalyan satires on TDP and YSRCP "ఫ్యానుకు పవర్ లేదు.. సైకిల్ చైను లేదు": పవన్ సెటైర్..

Jsp chief pawan kalyan satires on tdp and ysrcp parties

Pawan Kalyan, andhra pradesh CM Chandrababu, TDP president chandrababu, Chandrababu YS Jagan Pawan Kalyan, Janasena, TDP, YSRCP, pawan kalyan satire on Chandrababu and Jagan, pawan satire on TDP symbol cycle, pawan satite on ycp symbol fan, pawan satire on cycle and Fan, pawan satire on oppsosite parties, chandrababu, TDP, YS Jagan, YSRCP, sensational satire, andhra pradesh, politics

Janasena president Pawan Kalyan satires on Ruling TDP party and opposition YSRCP party at nellore. The power star says therr in no power for fan to rotate and no chain for cycle to run. Cycle chain was plunged into pieces by TRS satires pawan.

రైతు పింఛనుపైనే తొలిసంతకం: పవన్ కల్యాణ్

Posted: 03/26/2019 05:59 PM IST
Jsp chief pawan kalyan satires on tdp and ysrcp parties

జనసేన అధికారంలోకి వస్తే ఏటా ఆరు నుంచి పది గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని.. రైతులకు ఏటా రూ.5వేల పింఛన్ ఇస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రైతుల పెన్షన్ దస్త్రంపైనే తొలి సంతకం పెడతానని కూడా ఆయన పేర్కోన్నారు. ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తేనే ప్రజాప్రతినిధికి ఫించను వస్తున్న కాలంలో.. దశాబ్దాలుగా ప్రజలకు అన్నం పెడుతున్న అన్నదాతకు 60 ఏళ్లు నిండిన తరువాత పింఛను అందిస్తామని అన్నారు.

అంతేకాకుండా రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు ఎకరాకు రూ.8 వేలు అందజేస్తాంమని కూడా చెప్పారు. అభివృద్ధి అంటే కేవలం రాజధానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. మార్పు కోరుకునేవాళ్లంతా జనసేనకు ఓటు వేయాలని కోరారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థులపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ, ‘వాళ్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులా లేక బెట్టింగ్ రాయుళ్లా? అని ప్రశ్నించారు.

బెట్టింగ్ అరోపణలపై కేసులు నమోదు చేసిన పోలీసులపైనే దాడులకు తెగబడిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రజాక్షేత్రంలో పాల్గోనే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. క్లబ్ లో కూర్చొని పేకాట, బెట్టింగ్ లు ఆడుకోండి. పోలీసులను బెదిరించే వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా?’ అని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ‘ఫ్యాన్’ కు రెక్కలు విరగలేదు, అది తిరగడానికి ‘పవర్’ లేదు అని చెప్పడంతో చప్పట్లు మార్మోగిపోయాయి.

 ‘సైకిల్’కు ట్యూబ్స్ లేవని, ఇది వరకు సైకిల్ తొక్కుతూ వచ్చేవారని, ఇప్పుడు భుజాన వేసుకుని మోసుకొస్తున్నారంటూ టీడీపీపై సెటైర్లు విసిరారు. వాళ్లు సైకిల్ ఎందుకు తొక్కట్లేదంటే, సైకిల్ చైన్ ని కేసీఆర్ ఎప్పుడో తెంచేశారని, చైన్ లేకుండా సైకిల్ తొక్కితే ఎక్కడికీ వెళ్లదు అక్కడే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వారిని జగన్ అవమానిస్తున్నారని, ఇలాంటి విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని పవన్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janasena  pawan kalyan  chandrababu  TDP  YS Jagan  YSRCP  political satire  andhra pradesh  politics  

Other Articles