తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం సీఎంకు నోటీసులను జారీ చేసింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది.
కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు కేసీఆర్ పై ఈ పిటీషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తప్పుడు వివరాలు పొందుపరిచినందువల్ల కేసీఆర్పై అనర్హత వేటు వేయాలని శ్రీనివాస్ కోర్టుకు అప్పీల్ చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఎన్నికల కమీషన్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ వివరాలతో సంబంధమున్న మొత్తం 14 మందికి నోటీసులు జారీ చేసింది.
కేసీఆర్ పోందుపర్చని వివరాలేంటి.?
గత ఏడాది డిసెంబర్ 7న జరిగిన తెలంగాణ అసంబ్లీ ముందస్తు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ తనపై నమోదైన కేసులపై అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపర్చారు. ఆయనపై ఏకంగా 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్ లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఎం కేసీఆర్ సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా స్పందించి వివరణను ఇవ్వాలని అదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more