nara lokesh nomination under scanner నామినేషన్లలో అభ్యంతరాలు.. అభ్యర్థులకు టెన్షన్.. టెన్షన్..

Nara lokesh chitala ramachandrareddy nominations under scanner

TDP, Nara Lokesh, YSRCP, chitala ramachandra reddy, nomination, no due certificate, YCP pileru candidate, chitoor district, Mangalagiri, Election officials, Guntur, Andhra pradesh, politics

TDP minister Nara Lokesh, YSRCP chitoor district pileru candidate chitala ramachandrareddy nominations under scaner. Election officials gives 24 hrs time to rectify.

నామినేషన్లలో అభ్యంతరాలు.. అభ్యర్థులకు టెన్షన్.. టెన్షన్..

Posted: 03/26/2019 06:42 PM IST
Nara lokesh chitala ramachandrareddy nominations under scanner

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయన దాఖలు చేసిన నామినేషన్ చెల్లదంటూ అధికారులు స్పష్టం చేశారు. నామినేషన్ లో భాగంగా నారా లోకేశ్ సమర్పించిన కృష్ణా జిల్లా నోటరీ గుంటూరు జిల్లా మంగళగిరిలో చెల్లదని అధికారులు అభ్యంతరం తెలిపారు. నోటరీ చట్టంలోని సెక్షన్-9 ను ఈ సందర్భంగా అధికారులు ఉదహరించారు. అయితే, సరైన పత్రాలు సమర్పించేందుకు నారా లోకేశ్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి 24 గంటలు గడువు ఇచ్చారు.

చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ వర్గీయుల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ ఇంకా పెండింగ్ లో ఉండటమే దానికి కారణం. నామినేషన్ పత్రాలతో పాట నో డ్యూస్ సర్టిఫికెట్లను ఇవ్వని కారణంగా నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి పెండింగ్ లో ఉంచారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నో డ్యూస్ సర్టిఫికెట్స్ పై ప్రత్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్నికల అధికారికి తాను వివరణ ఇచ్చానని... తన సమాధానంపై ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Nara Lokesh  YSRCP  chitala ramachandra reddy  nomination  Andhra pradesh  politics  

Other Articles