Andhra Pradesh has 3.93 crore registered voters ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 93 లక్షలు..

23 lakh voters added in andhra since jan total at 3 93 crore ec

Andhra pradesh voters, Lok Sabha, Parliament of India, Andhra Pradesh, Indian general election in Andhra Pradesh, lakh applications, East Godavari, YSR Congress Party, official, false applications, bogus votes, General Elections 2019, TDP, BJP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, Andhra Pradesh, Politics

The election authorities announced that as on March 24, the state has a total of 3,93,12,192 voters. While nearly 25.21 lakh voters enrolled themselves since January 11, about 1.42 lakh were deleted from the electoral rolls.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 93 లక్షలు..

Posted: 03/26/2019 11:53 AM IST
23 lakh voters added in andhra since jan total at 3 93 crore ec

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఓటర్ల జాబితాపై అనేక అరోపణలు వచ్చాయి. తమ ఓట్లు ఓటరు జాబితాలో లేవంటూ కొందరు అభ్యర్థించగా, అధికారపక్షం అడ్డదారిలో అధికార పీఠాన్ని అధిరోహించేందుకు మార్గాలను అన్వేషిస్తోందని.. అందులో భాగంగా టీడీపీయేతర ఓటర్లను సర్వేల పేరుతో నమోదు చేసుకుని వారి ఓట్లను తొలగిస్తుందని కూడా అరోపించింది.

కాగా ఐటీ గ్రిడ్స్ సంస్థపై తెలంగాణ ప్రభుత్వ సహకారం పేరుతో అక్కడి పోలీసుల చేత దాడులు చేయింది.. తమ టీడీపీ పార్టీకి చెందిన సభ్యత్వం డేటాను అడ్డదారిలో పొందిన వైసీపీ పార్టీ.. వారి పేర్లతో ఎన్నికల సంఘానికి ఫామ్ 7 దాఖలు చేసి భారి సంఖ్యలో వారి ఓట్లను తీసివేయిందని.. అటు కేంద్రం.. ఇటు పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలతో చేయికలిపిన జగన్ ఇలా దొడ్డిదారిన అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడని అధికారపక్షం కూడా అరోపణలు గుప్పించింది.

దీంతో రంగంలోకి దిగిన ఈసీ ఈ నెల రాష్ట్రంలోని ఓటర్ల తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఓటరు జాబితాలో తమ పేర్లు మిస్ అయిన వ్యక్తులు తమ పేర్లను నమోదుచేసుకున్నారు. ఈ నెల 24 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 3 కోట్ల 93 లక్షల 12 వేల 192 మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది. జనవరి 11 తర్వాత 25 లక్షల 20 వేల 924 మంది ఓటర్లను చేర్చారు. లక్ష 41 వేల 823 మంది ఓటర్లను తొలగించినట్టు స్పష్టంచేశారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42 లక్ష 4 వేల 436 మంది ఉండగా.. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18 లక్ష 18 వేల 16 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles