Telangana has 2.95 crore registered voters తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 కోట్ల 95 లక్షలు..

Nearly 18 lakh voters added in telangana since jan total at 2 95 crore ec

Telangana voters, Lok Sabha, Parliament of India, Indian general election in Telangana, 23 lakh applications, TRS, Congress Party, official, false applications, bogus votes, qutbullahpur, badrachalam, General Elections 2019, TDP, BJP, MIM, Telangana Assembly Elections, Telangana, Politics

The election authorities announced that as on March 24, the Telangana state has a total of 2,95,18,964 voters. While nearly 17.72 lakh voters enrolled themselves since December 11 in the electoral rolls.

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 కోట్ల 95 లక్షలు..

Posted: 03/26/2019 12:36 PM IST
Nearly 18 lakh voters added in telangana since jan total at 2 95 crore ec

తెలంగాణలో మొత్తం 2.95 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1.48 కోట్ల మంది కాగా, మహిళలు 1.46 కోట్ల మంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా అర్హత కల్పిస్తూ ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ శుక్రవారం ఓటర్ల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,18,964గా ఉంది. వీరిలో పురుషులు 1,48,42,619 కాగా.. మహిళలు 1,46,74,977, థర్డ్‌ జెండర్‌ 1368 ఓట్లు వున్నాయి.

వీరిలో సర్వీస్‌ ఓటర్లు 10,307, ఎన్నారైలు 1,122, దివ్యాంగలు 4,69,030, 18 ఏళ్లు దాటిన వారు 5,99,933 ఉన్నారు. సవరణ సందర్భంగా 26,23,853 దరఖాస్తులు రాగా, 2,45,089 దరఖాస్తులను తిరస్కరించారు. 23,78,764 దరఖాస్తులను పరిష్కరించారు. తొలిసారి ఓటరుగా నమోదు చేసుకున్న వారు 19,15,240 కాగా ఇందులో 17,72,102 దరఖాస్తులు పరిష్కరించి వారికి ఓటరు జాబితాలో చోటు కల్పించారు. ఇక, 1,95,369 మంది డూప్లికేట్‌ ఓటర్లు, 44,721 మంది మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు రజత్‌ కుమార్‌ చెప్పారు.

మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల తదుపరి జాబితాలో కొత్తగా 17.72 లక్షల మంది చేరారు. ఇందులో 18-19 ఏళ్ల వయసున్న వారు 5.99 లక్షలుగా ఉన్నారు. కాగా, జనాభాతో పోలిస్తే రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య గణనీయంగానే ఉంది. ప్రతి 1000 మంది జనాభాకు 762 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇక, ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు గాను 989 మంది మహిళా ఓటర్లున్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుల కోసం మార్చి 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం కుత్బుల్లాపూర్‌ కాగా అత్యల్ప ఓటర్లున్న నియోజకవర్గం భద్రాచలం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles