జనసేన అధినేత పవన్ కళ్యాన్ అస్తులు ఎన్ని కోట్లు వుంటాయో.. అని తెలుసుకోవాలన్న ఉత్కంఠ అన్ని వర్గాల వారీకీ వుంటుంది. రెండు సినిమాలు తీసి.. నాలుగు యాడ్ చేస్తే ఏఢాదికి 150 కోట్ల రూపాయాలను సంపాదించే పవన్ కల్యాణ్.. తన అహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లారని మెగాబ్రదర్ నాగబాబు చెప్పిన క్రమంలో దశాబ్దమున్నర కాలం పాటు సినీజీవితంలో అనేక హిట్ చిత్రాలను చేసిన పవన్ ఆస్తులు ఎంత వుంటాయో తెలుసుకోవాలన్ని అసక్తి ఆయన అభిమానులకు కూడా వుంటుంది.
ఇక తాజాగా తన వద్ద డబ్బులు లేవు అంటూ పవన్ చెబుతున్న క్రమంలో ప్రస్తుతం ఆయన ఆస్తులు ఏమేర వుంటాయోనన్న ఆసక్తి కూడా అందరిలో నెలకోంది. అయితే తాజాగా ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలకు సంబంధించిన వివరాలు వెలువరించారు జనసేనాని. గాజువాక అసెంబ్లీ నుండి పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ తన నామినేషన్ లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తాజాగా వచ్చిన ఈ గణంకాలు పవన్ కల్యాణ్ అస్తులు.. 52 కోట్లు కాగా..అప్పులు 34 కోట్లుగా తేలింది.
పవన్ ఆస్తుల చిట్టా ఇలా..
పవన్ కళ్యాణ్ స్థిర, చరాస్తుల విలువ రూ.52 కోట్లు ఉండగా, అప్పులు రూ.34 కోట్లుగా చూపారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా.. సంతానం అకీరా, ఆద్య, పొలినా, మార్క్ శంకర్‌ల పేరిట డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉన్నట్లు వివరించారు. పవన్ కల్యాణ్ వద్ద చేతిలో నగదు నిల్వ రూ.4,76,436 కాగా, ఆయన భార్య అన్నా వద్ద రూ. 1.53,500గా చూపారు. పవన్ పేరిట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.3,10,18,731, ఐసీఐసీఐలో సేవింగ్స్ ఖాతాలో రూ.1,30,50,093, హెచ్‌డీఎఫ్‌సీ సేవింగ్స్ ఖాతాలో రూ.27,064, సీటీ బ్యాంకులో రూ.89,20,828, ఇండస్ బ్యాంకు లో రూ.43,828 ఉన్నాయి.
భార్య అన్నా పేరిట ఐసీఐసీఐలో రూ.13,872, హెచ్‌డీఎఫ్‌సీలో 46,845, హెచ్‌డీఎఫ్‌సీలో ఎఫ్‌డీ రూ.6,90,671, రష్యన్ బ్యాంకు ఆర్‌ఎఐఎఫ్‌లో రూ.3,51,117, మరో ఖాతాలో రూ.8,42,107 ఉన్నాయి. పవన్ సంతానం కే అకీరా పేరిట రూ.1,36,36,476, ఆద్య పేరిట రూ.1,00.80,636, పోలినా పేరిట రూ.29,58,966, మార్క్ శంకర్ పేరిట రూ.2,52,510 ఉన్నట్లుగా నామినేషన్ లో పేర్కొన్నారు.
పవన్ ఆభరణాలు ఇలా..అప్పులు ఇలా..
అలాగే పవన్ వద్ద 312 గ్రా. బంగారు, వజ్రాభరణాల విలువ రూ.27.08 లక్షలు, భార్య అన్నా పేరిట 215 గ్రా. బంగారు, వజ్రాభరణాలు విలువ రూ.9.52 లక్షలుగా చూపారు. పవన్ పేరిట మెర్సిడెస్ బెంజ్ రూ.72,92,264, టయోటా ఫార్చ్యున్ రూ.27.5 లక్షలు, స్కోడా రేపిడ్ రూ.27.67 లక్షలు, మహేంద్ర స్కార్పియో రూ.13.82 లక్షలు, వోల్వో కారు రూ.1.07 కోట్లు, హార్లీ డేవిడ్‌సన్ మోటారు సైకిల్ రూ.32.66 లక్షలు ఉన్నాయి.
పవన్ కల్యాన్ స్థిరాస్తులు వివరాలు ఇలా..
వ్యవసాయ భూములు 4 ఎకరాలు రూ.4,02,500, మరో వ్యవసాయ భూమి 4.02 ఎకరాలు విలువ రూ.4,24,615, మరో స్థిరాస్తి 10 ఎకరాలు విలువ రూ.2.76 కోట్లుగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో 1458, 753, 600 చదరపు గజాల నివాస స్థలాలు ఉన్నాయి. మంగళగిరిలో 0.9 ఎకరాల స్థలం, 2.07 ఎకరాల స్థలంతో పాటు శేరిలింగంపల్లిలో 1050 చదరపు గజాల నివాస స్థలం ఉన్నాయి.
పవన్ కల్యాణ్ అప్పుల వివరాలు ఇలా..
ఇక పవన్ కల్యాణ్ అప్పుల వివరాల విషయానికి వస్తే.. ఆయన బ్యాంకులు, వ్యక్తులు, సినీ నిర్మాణ సంస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.32 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. పవన్ కల్యాన్ తన విద్యార్హత పదో తరగతిగా పేర్కొన్నారు. ఆయన 1984లో నెల్లూరు లోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యారు. ఇదే విషయాన్ని అఫిడిట్ లో పేర్కొన్నారు. తాను వివిధ చిత్ర నిర్మాణ సంస్థలకు, వ్యక్తులకు 34 కోట్ల మేర అప్పు ఉన్నట్లు పవన్ తన అఫిడవిట్ లో వెల్లడించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 2.4 కోట్ల అప్పు ఉన్నట్లు..అదే విధంగా, ఇక తన వదిన కొణిదెల సురేఖకు కూడా 1.7 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని సంస్థ నుంచి 25 లక్షలు తీసుకుని ఉన్నట్లు పవన్ తెలిపారు. కొందరు ఇతర వ్యక్తులకు కూడా బాకీ పడ్డట్లు అఫిడవిట్ లోవెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more