Ex-Mangalagiri MLA quits TDP, joins YSRCP వైసీపీ గూటికి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

Shock to nara lokesh ex mangalagiri mla kandru kamala quits tdp joins ysrcp

Ex-Mangalagiri MLA Kandru Kamala quits TDP, Ex-Mangalagiri MLA quits TDP, Ex MLA Kandru Kamala, Ex-Mangalagiri MLA, TDP, Nara Lokesh, Mangalagiri, YS Jagan, YSRCP, andhra pradesh, politics

Former Mangalagiri MLA Kandru Kamala quit TDP and joined the YSRCP in the presence of YS Jaganmohan Reddy. Kamala slammed TDP chief Chandrababu for not allocating Mangalagiri TDP ticket to BC candidate which he promised.

మంగళగిరిలో నారా లోకేష్ షాక్.. వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

Posted: 03/22/2019 01:04 PM IST
Shock to nara lokesh ex mangalagiri mla kandru kamala quits tdp joins ysrcp

గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ నాయకురాలు, ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ ను కలిశారు. ఆమెకు తన పార్టీలోకి సాధరంగా అహ్వానించిన జగన్.. వైసీపీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో మంగళగిరి నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయిస్తున్నారని, ఈసారి కూడా బీసీ అభ్యర్థులకే టికెట్ ఇస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను మోసం చేశారని విమర్శించారు.

బిసిల గర్జన పేరుతో వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ వారిని రాజకీయంగా మాత్రం అణిచివేస్తోందని అమె అరోపించారు. రాష్ట్రంలో బీసీల అభివృద్దికి కట్టుబడి వున్నామని చంద్రబాబు ప్రభుత్వం వంచిస్తుందని మండిపడ్డారు. టీడీపీ పాలనతో బీసిల అభివృద్ది అంతా మాటలకు, కాయితాలకు మాత్రమే పరిమితం అయ్యిందని.. చేతలకు, ఆచరణకు మాత్రం నోటుకోలేదని అమె దుయ్యబట్టారు. చంద్రబాబు పాలన కుటంబ అభివృద్దికి మాత్రమే కట్టుబడి వుందని తీరు స్పష్టంగా కనబడుతుందని ఎద్దేవా చేశారు.

తన కొడుకును అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారని కమల అరోపించారు. మంగళగిరి టిక్కట్ ను బీసీలకే కేటాయిస్తానని నమ్మబలికిన చంద్రబాబు.. మీరందరూ ఒక వైపుకు వస్తే బాగుంటుందని నమ్మించి.. మాట తప్పినందుకు నిరసనగా తాము టీడీపీ నుంచి బయటకు వస్తున్నామని వైసీపీలో చేరుతున్నామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజారంజక పాలన కావాలంటే ఒక్కసారి వైఎస్ జగన్ కు అవకాశమివ్వాలని కమల కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kandru Kamala  Ex-Mangalagiri MLA  TDP  Nara Lokesh  Mangalagiri  YS Jagan  YSRCP  andhra pradesh  politics  

Other Articles