Hitec City Metro route will be inaugurated on March 20 హైటెక్ సిటీకి.. ఈ నెల 20 నుంచే మెట్రో కూత

Hyderabad metro rail ameerpet to hitec city route will be inaugurated on march 20

Hyderabad Metro, Hyderabad Metro Rail, Hyderabad Metro Rail Limited, Ameerpet Hitech City Metro route, Ameerpet to Hitec City route, metro rail, hyderabad, ameerpet to hitech city, flagged off, Esl Narasimhan, KTR, V.Srinivas Goud

Hyderabad Metro Rail services for Ameerpet to Hitec City route will be flagged off on 20th March 2019 at around 9:15 a.m. It will be inaugurated by Governor Shri. E.S.L. Narasimhan.

అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీకి.. ఈ నెల 20 నుంచే మెట్రో కూత

Posted: 03/18/2019 08:12 PM IST
Hyderabad metro rail ameerpet to hitec city route will be inaugurated on march 20

ట్రాఫిక్ కు చెక్ పెట్టి.. గమ్య స్థానాలకు వేగంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో ఆరంభమైన మెట్రో ప్రాజెక్టు మరో రూట్ లో కూడా త్వరలో సేవలను అందించనుంది. ఐటీ ఉద్యోగులతో నిత్యం రద్దీగా వుంటూ అమీర్ పేట్, హైటెక్ సిటీ మెట్రో మార్గంలో మెట్రో సేవలు ఈ నెల 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 20న తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతుల మీదుగా లాంఛనంగా ఈ మార్గంలో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తమ ట్విట్టర్ లో అధికారికంగా ట్వీట్ చేసింది. గవర్నర్ తో పాటుగా కేటీఆర్, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ల పేర్లను కూడా జోడించి జతపర్చింది. భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగస్థులు ఉన్న ప్రాంతంలో మెట్రో కోసం ఎదురుచూపులకు చెక్ పెట్టనున్నారు. మార్చి 20న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ వరకూ వెళ్లనున్న రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు.

ప్రాజెక్టులో మియాపూర్ -ఎల్బీనగర్ (29 కి.మీ), నాగోల్-అమీర్‌పేట (17కి.మీ.) రూట్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త రూట్‌తో ప్రయాణానికి మరింత సౌలభ్యం లభించనుంది. అమీర్‌పేట, హైటెక్‌సిటీ 11 కి.మీల మేర ప్రయాణంలో 8 స్టేషన్లు ఉన్నాయి. కాగా, హైదరాబాద్‌లో తొలిసారిగా 2017 నవంబరు 29న ప్రారంభమైంది మెట్రో. మొదటి దశలో మిగిలిన జేబీఎస్-ఎంజీబీఎస్ 10 కిమీల దూరం, ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి.

కాగా, అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ చేరుకునే మార్గంలో మొత్తంగా ఎనమిది స్టాపులు వున్నాయి. అమీర్ పేటు తరువాత మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్,  దుర్గం చెరువుల మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటుంది. దీంతో నగరంలో నిత్యం ట్రాఫిక్ రద్దీలో ప్రయాణించే వాహనదారులు కొంత ఉపశమనం లభించినట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro rail  hyderabad  ameerpet to hitech city  flagged off  Esl Narasimhan  KTR  V.Srinivas Goud  

Other Articles

Today on Telugu Wishesh