Another shocks TDP, nandyal mp spy reddy quits party c నంద్యాల బరిలోకి స్వతంత్రంగా దిగుతా.. సత్తా చాటుతా: ఎస్పీవై రెడ్డి

Will contest lok sabha elections as independent spy reddy

Nandyal, MP, spy reddy, sajjala sridhar reddy, Resigns, TDP, Kurnool, rebel candidate, independent, kurnool, Andhra pradesh, AP politics

Another big jolt to Ruling Telugu desam party as prominent leader from kurnol and sitting nandyal mp spy reddy quits party. He says he along with his newphew sajjala sridhar reddy will contest nandyal assembly and lok sabha elections as independent

నంద్యాల బరిలోకి స్వతంత్రంగా దిగుతా.. సత్తా చాటుతా: ఎస్పీవై రెడ్డి

Posted: 03/18/2019 07:33 PM IST
Will contest lok sabha elections as independent spy reddy

ఎన్నికల వేళ అధికార టీడీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికీ అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీలోకి వెళ్లిన కొందరు నేతలు వలసలు వెళ్లగా, తన దారి స్వతంత్ర్య ధారి అని ప్రకటించుకున్నారు కర్నూలు టీడీపీ పార్టీ నేత. ప్రస్తుతం నంద్యాల పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న ఎస్.పి.వై.రెడ్డి అధికార టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. తనతో పాటు ఆయన అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. టీడీపీ అధిష్టానం నమ్మించి మోసం చేసిందంటూ మీడియా ఎదుట కంటతడిపెట్టారు. దీంతో కర్నూలు జిల్లాలో కోట్ల వర్గం చేరడంతో టీడీపీ బలోపేతం అయినా.. ఎస్.పి.వై.రెడ్డి రెడ్డి వర్గం పార్టీని వీడటంతో షాక్ తగిలింది.

ఈ సందర్భంగా ఎస్.పి.వై.రెడ్డి మాట్లాడుతూ.. తమను టీడీపీ పార్టీ నిండా మోసం చేసిందని అరోపించిన ఆయన.. తాను తప్పక నంద్యాల పార్లమెంటు ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. అయితే సీటు కోసం ఏ ఒక్క పార్టీలో చేరబోమని.. తాము స్వతంత్రంగానే ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా ఏంటో కూడా చాటిచెబుతామని చెప్పారు. నంద్యాల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి.. తమ సత్తా చూపిస్తాం అని సవాల్ విసిరారు. బ్లాక్ మెయిలింగ్, లాబీయింగ్ తెలియదు కాబట్టే టికెట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల వేళ వివిధ పార్టీలకు చెందిన నేతలు జంప్ అవుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన వారు వివిధ పార్టీల్లోకి వెళుతున్నారు. నంద్యాల ఎంపీ, అసెంబ్లీ టికెట్లను తమ కుటుంబానికి కేటాయించాలని ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి టీడీపీ అధిష్టానాన్ని కోరుతూ వస్తున్నారు. టీడీపీ సానుకూలంగా స్పందించలేదు. 15 సంవత్సరాలుగా ఎంపీగా సేవలందించి, పేద ప్రజలకు సేవ చేసిన తమ కుటుంబానికి టికెట్ కేటాయించడంలో బాబు అలసత్వం చూపడం బాధించిందన్నారు ఎస్.పి.వై.రెడ్డి. ఎన్నికల బరిలో నిలువకుండా ఆయన్ను టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyal  MP  spy reddy  sajjala sridhar reddy  Resigns  TDP  Kurnool  Andhra pradesh  AP politics  

Other Articles