Mukesh Ambani bails out Anil in Ericsson dispute ఎరిక్సన్ కేసు నుంచి అనీల్ ను బయటకు తెచ్చిన ముఖేష్ అంబాని

Mukesh ambani bails out younger brother in ericsson dispute

Mukesh Ambani, Jio, Anil Ambani, ericsson, Reliance Communication, Ericsson dues, RCom, Supreme Court, Debt. industry news, industry growth, indian industry news,

Mukesh Ambani, Chairman of Reliance Industries, has helped younger brother Anil Ambani avoid a potential jail term by providing Rs 462 crore to repay Swedish telecom equipment maker Ericsson's dues.

ఎరిక్సన్ కేసు నుంచి అనీల్ ను బయటకు తెచ్చిన ముఖేష్ అంబాని

Posted: 03/18/2019 09:04 PM IST
Mukesh ambani bails out younger brother in ericsson dispute

ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్ కామ్ చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఈ రోజు వరకు వడ్డీతో కలిపి ఆర్ కామ్ ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని, అనిల్ అంబానీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఎరికన్స్ తరపు అడ్వకేట్ అనిల్ ఖేర్ తెలిపారు. ఇంతకుముందే రూ.118 కోట్లను ఆర్ కామ్ సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసింది. దీంతో ఎరిక్సన్ కి బాకీ ఉన్న మొత్తం రూ.580కోట్లను ఆర్ కామ్ చెల్లించినట్లయింది. బీఎస్ఈలో ఆర్ కామ్ షేర్లు 9.3 శాతం పడిపోయి రూ.4 దగ్గర కొనసాగుతోంది.

తమకు చెల్లించాల్సిన బకాయిలను ఆర్ కామ్ చెల్లించలేదంటూ 2018లో ఎరిక్సన్ కోర్టుని ఆశ్రయించింది. దీంతో అక్టోబర్-23,2018న సుప్రీంకోర్టు ఎరిక్సన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. డిసెంబర్-15,2018లోగా ఎరికన్స్ కు బకాయిలు చెల్లించాలని ఆర్ కామ్ ను కోర్టు ఆదేశించింది. ఆలస్యం చేస్తే 12శాతం వార్షిక వడ్డీతో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీని కోర్టు ధిక్కరణ కింద జైలుకి పంపాలని,విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ మరోసారి సుప్రీంని ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి-20,2018న అనీల్ అంబానీని దోషిగా తేల్చింది. నాలుగువారాల్లోగా ఎరిక్సన్ కు రూ.453 కోట్లు బాకీ చెల్లించకుంటే మూడు నెలల జైలు శిక్ష తప్పదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విధించిన నాలుగువారాల గడువు  అయితే చివరి క్షణంలో రంగంలోకి దిగిన అనీల్ అంబానీ సోదరుడు ముఖేష్ అంబానీ తన తమ్ముడిని జైలు పాలు కాకుండా కాపాడగలిగారు. ఎరిక్సన్ కు ఇవాళ బాకీ డబ్బులు చెల్లించడంతో జైలుకెళ్లే పరిస్థితి నుంచి అంబానీ బయటపడ్డారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles