social media monitoring for the first time: CEC తొలిసారి అభ్యర్థులు సామాజిక మాధ్యమాలపై ఈసీ ఆంక్షలు

Election commission introduces social media monitoring for the first time

Lok Sabha, social media, GPS, election commission, hate speech, misuse of content, political ads, sunil arora, politics

EC introduces social media monitoring for the first time, watch out to curb any sort of hate speech or misuse of content related to polling and also advertising through this platform

తొలిసారి అభ్యర్థులు సామాజిక మాధ్యమాలపై ఈసీ ఆంక్షలు

Posted: 03/11/2019 02:43 PM IST
Election commission introduces social media monitoring for the first time

సాంకేతిక విప్లవంతో వచ్చిన మార్పులు నేపథ్యంలో సామాజిక మాద్యమాలు తన ప్రభావాన్ని ఉవ్వెత్తున చాటుకుంటున్నాయి. సోషల్ మీడియా సమాజంలోని అన్నింటిపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీడియా కన్నా వేగంగా తన ఉనికిని చాటుతున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ల కారణంగా ప్రజలకు ముఖ్యంగా నెట్ జనులకు అనేక విషయాలు అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ఈ సామాజిక మాధ్యమాలు ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సైతం ప్రభావితం చూపనున్నాయన్న వార్తల నేపథ్యంలో తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతుందన్న ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా, ఓటర్ నాడి పట్టడానికి, అతడిని ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాన్ని మించింది లేదని ఆయా పార్టీలు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసుకోవడం ఈ కోవలోకే వస్తుంది.

అందుకే, కేంద్ర ఎన్నికల సంఘం ఓటరును ప్రలోభపెట్టే పార్టీలు, వ్యక్తులను నియంత్రించేందుకు కొత్త నియమావళి రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆన్ లైన్ లో దర్శనమిచ్చే రాజకీయ ప్రకటనలకు ఇకమీదట ముందస్తు ధృవీకరణ తప్పనిసరి అని అదేశాలను కూడా జారీ చేసింది.

ఈ మేరకు గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలు రాజకీయ ప్రకటనను పూర్తిగా పరిశీలించిన మీదటే అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది. ఇలాంటి రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఆఫీసర్ ను కూడా నియమిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. అంతేకాదు, ఓ అభ్యర్థి సామాజిక మాధ్యమాల్లో చేసే రాజకీయ ప్రచారానికి అయిన ఖర్చును కూడా ఎన్నికల ఖర్చుల పట్టికలో రాయాల్సిందేనని స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles