comedian Ali Joins YSR Congress వైసీపీలో చేరిన కమేడియన్ అలీ..

Telugu comedian actor ali joins ysr congress in hyderabad

Lok Sabha Elections 2019, Telugu actor Ali, YSR Congress Party, YSRCP, YS Jaganmohan Reddy, TDP, JSP, Pawan Kalyan, Chandrababu Naidu, General Elections 2019, Lok Sabha Polls

Ali, the popular Telugu actor known for his superb comic timing began a new inning by launching his political career. Ali joined YSR Congress Party in presence of party chief YS Jaganmohan Reddy.

వైసీపీలో చేరిన కమేడియన్ అలీ.. జగన్ ను సీఎం చేసేందుకు కృషి

Posted: 03/11/2019 01:28 PM IST
Telugu comedian actor ali joins ysr congress in hyderabad

రాష్ట్ర మంత్రిని కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల చుట్టూ ప్రదిక్షిణలు చేసి.. ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల సమరశంఖారవాన్ని పూరించిన క్రమంలో చివరాఖరకు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ప్రముఖ హాస్య నటుడు అలీ. ఈ ఉదయం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన ఆ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలీని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్.

ప్రజలంతా జగన్ రావాలి, జగన్ కావాలి అని కోరుకుంటున్నారని... అందుకే ఆయనకు తనవంతు చేయూతను అందిద్దామని వైసీపీలో చేరానని అన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచీ పోటీ చేయడం లేదని, కేవలం పార్టీ తరపున ప్రచారం మాత్రం చేస్తానని తెలిపారు. లోటస్‌పాండ్‌లో ఈరోజు ఉదయం జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

 జగన్‌ మోహన్‌రెడ్డి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారని అలి తెలిపారు. ‘ప్రజా సంకల్ప యాత్ర సమయంలోనే తాను జగన్ ని కలిసి.. మాట్లాడానని తెలిపారు. పార్టీలో చేరమని ఆయన కోరారు. కానీ తానే కొంత సమయం కావాలన్నాను’ అని అలీ చెప్పుకొచ్చారు. తన పాదయాత్ర సమయంలో జగన్‌ పలువురికి టికెట్ పై హామీ ఇచ్చారని, అందువల్ల తనకు టికెట్‌ దక్కే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని జగన్‌ ఆదేశిస్తే తప్పకుండా శిరసావహిస్తానని చెప్పారు.

వైసీపీ అధినేత జగన్ తో తన పరిచయం ఈ నాటిది కాదని చెప్పిన అలీ.. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచే జగన్ తనకు తెలుసని చెప్పారు. వైయస్ సీఎం కాకముందు ప్రతి రోజు జగన్ ను కలిసేవాడినని తెలిపారు. తాజాగా ఇవాళ పార్టీలో చేరడంపై జగన్ తనతో మాట్లాడుతూ.. ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది.. వస్తావని ఆశించాను.. ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగా ఆలస్యమైయ్యింది.. అంటూ తనను పార్టీలోకి ఆహ్వానించారని అలి చెప్పుకోచ్చారు.

స్నేహం వేరు రాజకీయం వేరని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీలో చేరికపై ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన అలీ.. పవన్ తనకు మంచి మిత్రుడు అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పవన్ కల్యాణ్ ను కాదని వైసీపీలో ఎందుకు చేరారంటూ మీడియా ప్రశ్నించగా... ఆయన ఈ విధంగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ విజయవంతమైతే, తాను కూడా సక్సెస్ అయినట్టే ఫీల్ అవుతానని అలీ తెలిపారు. అన్ని పార్టీల్లో ఉన్న నాయకులంతా తనకు తెలిసినవాళ్లేనని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles