Buddha Venkanna sensational comments on KCR కేసీఆర్ పై బుద్దా వెంకన్న సంచలన అరోపణలు

Buddha venkanna sensational comments on actor ali and kcr

TDP spokesperson Buddha Venkanna on Actor Ali, Buddha Venkanna sensational comments on Ali, Buddha Venkanna sensational allegations on KCR, Telangana CM KCR vendatta Politics, Buddha Venkanna, Telugu Actor Ali, Comedian, YSRCP, TDP, KCR, Telangana, Andhra Pradesh, Politics

TDP spokesperson Buddha Venkanna had made sensational comments on Actor Ali and Telangana CM KCR. He alleges that Actor Ali been threatened by Telangana CM KCR and suggested him to join YSRCP instead of TDP.

కమేడియన్ అలీ, కేసీఆర్ లపై బుద్దా వెంకన్న సంచలన అరోపణలు

Posted: 03/11/2019 03:28 PM IST
Buddha venkanna sensational comments on actor ali and kcr

తెలుగు సినీ కామేడియన్, నటుడు అలీ వైసీపీలో చేరిన నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన అరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయంలో నేరుగా వచ్చి ప్రచారం చేపడతానన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ అధినేత, సీఎం చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కోనే శక్తి లేక కేవలం బెదిరింపు, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.

టీడీపీ పార్టీలోకి చేరేందుకు ముందుకు వస్తున్న ప్రముఖులను టార్గెట్ చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని వైసీపీలో చేరేలా దారిమళ్లిస్తున్నారని, అందుకు వారిపై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని అరోపించారు. హైదరాబాద్ సహా తెలంగాణలో అస్తుల వివరాలను తెలుసుకుంటున్న కేసీఆర్.. వారిని నయానా, భయానా భయపెట్టి వైసీపీ పార్టీ వైపు వెళ్లేలా చర్యలు చేపడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు కమేడియన్ అలీ ఘటనే ఉదాహరణగా పేర్కోన్నారు.

ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు దగ్గరకు వస్తానని సినీనటుడు అలీ తనతో చెప్పారన్న ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులతో వైఎస్ జగన్ వద్దకు వెళ్లి.. వైసీపీలో చేరాని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి అలీ అన్న బుద్దా వెంకన్న.. వైఎస్ జగన్ తన పార్టీ వైసీపీని కేసీపీగా మార్చారన ఎద్దేవా చేశారు. ఇక ప్రధాని మోడీ, కేసీఆర్ ఒత్తిడి తెచ్చే మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు పెట్టించారని బుద్దా వెంకన్న ఆరోపించారు.

ప్రత్యర్ధుల కుట్రలు ఎలా ఉన్నా.. ఎన్నికలకు మేం సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను పడగొట్టడానికి టీడీపీకున్న ఆయుధాలు ప్రజలేనన్న బుద్దా.. అభివృద్ధి-సంక్షేమం చంద్రబాబు చరిత్ర అయితే.. జైలు జీవితం-అవినీతి జగన్ చరిత్ర అని వ్యాఖ్యానించారు. మరోవైపు మంత్రి దేవినేని ఉమ సోదరుడు ఎప్పుడో వైసీపీలో చేరారని... ఆ తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉన్నారన్న వెంకన్న.. ఇప్పుడు మళ్లీ వైసీపీలో చేరారంటూ హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వాళ్లు సొంత వాళ్లైనా సరే తాను, దేవినేని ఉమ పట్టించుకోవడం లేదని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Buddha Venkanna  Telugu Actor Ali  Comedian  YSRCP  TDP  KCR  Telangana  Andhra Pradesh  Politics  

Other Articles