Temperature above normal in Telangana బెంబేలెత్తిస్తున్న ప్రచంఢ భానుడు.. రాజధానిలో 39 డిగ్రీలు..

Temperature touches 39 degrees in parts of telangana

Indian Meteorological Department, IMD, Telangana Summer, Telangana State Development Planning Society (TSDPS), maximum temperature, hotty summer in Telangana, above normal temperature in telangana, Weather, Telangana capital, Ameerpet, Hyderabad

With the State slowly marching towards summer season, temperatures are on a rise in Hyderabad and some other places. The maximum temperature in the city touched 37.20 Celsius on Sunday, which was 2.3 degrees above normal

బెంబేలెత్తిస్తున్న ప్రచంఢ భానుడు.. రాజధానిలో 39 డిగ్రీలు..

Posted: 03/11/2019 12:36 PM IST
Temperature touches 39 degrees in parts of telangana

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు ముదురుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే ప్రచండుడిలా భానుడు తడాఖా చూపిస్తున్నాడు. ఎండలతో జనాలను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పనులు వుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వచ్చినా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.

వాతావరణ శాఖతోపాటు  రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) కూడా భానుడి భగభగల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని.. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం తెలంగాణలో సాధారణ స్థాయికి మించి రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుందని.. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది.
 
మార్చి 10న నాగర్‌కర్నూలు,  నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా..జగిత్యాల, వనపర్తి తదితర ప్రాంతాల్లో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్ నగర్‌ జిల్లాలో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా,  మెదక్, ఖమ్మం జిల్లాల్లో వరుసగా 38, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 2.3 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. భద్రాచలం, ఖమ్మంలో శనివారం సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది.

ఇక ఇటు తెలంగాణ రాజధాని నగరంలోనే భానుడి దంచికోడుతున్నాడు. ఆదివారం రోజున హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కోన్నారు. అమీర్ పేట్ సికింద్రాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో క్రితం రోజు 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఉప్పల్, షేక్ పేట్, హిమాయత్ నగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ పేర్కోంది. కాగా, భారత వాతవరణ కేంద్రం మాత్రం చిరుజల్లులు కురిసే అవకాశాలు కూడా వున్నాయిన భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Meteorological Department  IMD  Telangana Summer  TSDPS  

Other Articles