Four Indians dead in Ethiopian Airline crash ఇథోపియాలో విమాన ప్రమాదం.. గుంటూరులో విషాధఛాయలు

Guntur woman among four indians killed in ethiopian airlines crash

Ethiopian Airlines, Lion Air, Ethiopia, United Nations Development Programme, boeing 737, Sushma Swaraj, Shikha Garg, United Nations Development Programme (UNDP), Pannagesh Bhaskar Vaidya, Hansini Pannagesh Vaidya, Nukavarapu Manisha. N Manisha, Social media, Politics

Four Indians, including a UN consultant attached with the Environment Ministry, were among the 157 people killed when a Nairobi-bound Ethiopian Airlines plane crashed after taking-off from Addis Ababa.

ఇథోపియాలో విమాన ప్రమాదం.. గుంటూరులో విషాధఛాయలు

Posted: 03/11/2019 11:49 AM IST
Guntur woman among four indians killed in ethiopian airlines crash

ఇథియోపియాలో రాజధాని అబిస్ అబాబా విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తంగా 157 మంది మృతిచెందాగా వారిలో నలుగురు భారతీయులలు కూడా వున్నారు. ఇక ఈ నలుగురిలో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరుకు చెందిన అమ్మాయి కూడా వుంది. తన అక్కను చూడటానికి వెళ్తూ ఈ విమానంలో ఎక్కిన అమె.. ప్రమాదంలో అసువులుబాసింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో 149 మంది ప్రయాణికులు కాగా, 8 మంది సిబ్బంది ఉన్నారు.

గుంటూరుకు చెందిన యువ డాక్టర్ నూకవరపు మనీషా సహా మొత్తం నలుగురు భారతీయులు ఉన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన నూకవరపు వెంకటేశ్వరరావు, భారతి దంపతుల రెండో కుమార్తె మనీషా గుంటూరు మెడికల్ కాలేజీలో నాలుగేళ్ల క్రితం మెడిసిన్ పూర్తిచేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కెన్యా రాజధాని నైరోబీలో ఉంటున్న మనీషా అక్క లావణ్య 10 రోజుల క్రితమే ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చారు. వారిని చూసేందుకు అమెరికా నుంచి బయలుదేరిన మనీషా ముందుగా ఇథియోపియాకు చేరుకున్నారు.

అక్కడ నుంచి నైరోబీ వెళ్లేందుకు ఇథియోపియా ప్రభుత్వరంగ సంస్థ ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌(ఈఏ)కు చెందిన బోయింగ్‌ 737-8 మాక్స్‌ విమానం ఎక్కారు. దేశ రాజధాని అడిస్‌ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం 8.38 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం 8.44 గంటలకు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత అడిస్ అబాబాకు దక్షిణాన 50కిలోమీటర్ల దూరంలో బిషోఫ్తు పట్టణ సమీపంలోని హెజెరె ప్రాంతంలో కుప్పకూలినట్లు గుర్తించారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన 157 మందిలో మనీషా కూడా ఉన్నారు. మనీషా తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే గుంటూరు నగరంలోని నవభారత్‌ నగర్‌లో స్థిరపడ్డారు. అయితే పెద్ద కుమార్తె గర్భవతి కావడంతో నెలరోజులుగా నైరోబీలోనే ఉంటున్నారు. వారి వద్దకు వెళ్తుండగానే మనీషా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మనీషాతో పాటు మనదేశానికి చెందిన వైద్య పన్నగేశ్‌ భాస్కర్‌, వైద్య హన్సిన్‌ అన్నగేశ్‌, పర్యావరణశాఖ కన్సల్టెంట్‌ శిఖా గార్గ్‌ విమాన ప్రమాదంలో మృత్యువాతపడ్డారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles