Fire Breaks Out on Yesvantpur-Tatanagar Express యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం..

Fire breaks out in yesvantpur tatanagar express no casualty so far

fire accident, fire accident in pantry area, Yesvantpur-Tatanagar Superfast Express, train accident in AP, pantry bogie, fire accident, Yesvantpur-Tatanagar Express, pantry car, gollaprolu railway station, train accident video, Crime

A major fire broke out in the pantry car of Yesvantpur-Tatanagar Superfast Express late night on Monday. The train was heading to Jamshedpur from Bengaluru when the fire broke out around 2:00 am in the pantry car.

ITEMVIDEOS: యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం..

Posted: 03/05/2019 11:55 AM IST
Fire breaks out in yesvantpur tatanagar express no casualty so far

యశ్వంత్ పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలులోని ఓ బోగీలో మంటలు చెలరేగగా.. వాటిని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగటం.. రైలు డ్రైవర్ కూడా అప్రమత్తతతో వ్యవహరించిన కారణంగా కేవలం ఒక్క బోగి మాత్రమే పూర్తిగా దగ్ధమైంది. అయితే మిగతా బోగీలకు మంటలు వ్యాపించకుండా రైల్వే అధికారులు కూడా సకాలంలో స్పందించి బోగీలను వేరు చేయడంతో ప్రాణనష్టం సంభవించకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో రైల్లోని ప్యాంట్రీకారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. రైలులో మొత్తం 23 బోగీలు ఉండగా 9వ బోగీ అయిన పాంట్రీకార్ మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలు ఆపేశారు. ఆపై రైల్వే సిబ్బంది కూడా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న ఈ సమయంలో మంటలు చెలరేగడంతో వారంతా విషయం తెలిసి భయాందోళనకు లోనయ్యారు. ప్యాంట్రీ కార్(వంట చేసే) బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణకు అదేశించామని చెప్పారు. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంతో రైలుని గొల్లప్రోలు స్టేషన్‌లో నిలిపివేశారు. 5 గంటలుగా రైలు అక్కడే నిలిచిపోయింది.

అయితే ప్రమాదఘటనకు చేరుకుంటున్న రైల్వే అధికారులు ప్రమాదం గురించే పట్టించుకుంటున్నారు తప్పితే.. రైలు ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు పడే అవస్థలను, పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఘటనాస్థలంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంటిపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. కనీసం తాగడానికి మంచీ నీళ్లు కూడా లేవని వాపోతున్నారు. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ గురించి పట్టించుకోవడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. తక్షణమే రైల్వే శాఖ అధికారులు స్పందించాలని రైలుని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రంగంలోకి దిగిన స్థానికులు, సేవా సంస్థలు ప్రయాణికులకు తాగునీరు, అల్పాహారం వంటివి అందజేస్తున్నారు. స్థానికుల చొరవతో కొంతమంది చంటిపిల్లలకు పాలు లాంటి సదుపాయం కలిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles