జమ్మూకాశ్మీర్ పుల్వామా దాడి తరువాత.. పాకిస్థాన్ ఉగ్రవాద దాడుల్లో భారత భద్రతా దళాలు అధిక సంఖ్యలోనే జవాన్ల ప్రాణాలను కొల్పోతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో వరుసగా జరగుతున్న ఎన్ కౌంటర్లలో పూల్వామా దాడి తరువాత సుమారు 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. పూల్వామా దాడి జరిగిన నాలుగురోజులకే ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో తనిఖీలు చేస్తున్న భద్రతా దళాలు ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులతో గంటల పాటుపోరాడి వారందరినీ హతమర్చారు.
అయితే ఓ ఉగ్రవాది మాత్రం చనిపోయినట్లుగా నటించి భారత భద్రతాదళాలపై తుపాకీతో తెగబడిన ఘటనలో ఒక మేజర్ సహా నలుగురు జవాన్లు మరణించిన విషయం కూడా తెలిపింది. రెండు రోజుల క్రితం రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో ఐదుగురు జవాన్లను కోల్పోవడం జరిగింది. ఉగ్రవాది నక్కజిత్తుల తెలివితో దొంగదెబ్బతీయడంతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో నిన్న అర్థరాత్రి నుంచి పూల్వామాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతాదళాలు ఉగ్రవాదులు నక్కిన ఇంటినే పేల్చివేసి వారిని మట్టబెట్టాయి.
త్రాల్ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేశారు. చాలాసేపు ఇరువర్గాల మధ్య ఫైరింగ్ జరిగింది. చివరక భద్రతా బలగాలు ఆ ఇంటిని పేల్చేశాయి. ఈ ఎన్ కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కొద్దిసమయానికే మరో ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం తెల్లవారుజామున 4.30గంటల నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.
పుల్వామా జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారింది. దీంతో భద్రతా దళాలు అక్కడ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ముష్కరులను ఏరిపారేసే పనిని ముమ్మరం చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా టెర్రరిస్టుల కోసం సెర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తర్వాత... దాడి సూత్రధారులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇప్పుడు మరో ఎన్కౌంటర్ జరిగింది. పుల్వామా దాడి తర్వాత జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని భద్రతా దళాలు కంటిన్యూ చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more