Pakistani drone shot down in Bikaner పాకిస్తాన్ ద్రోణిని కూల్చిన భారత సుఖోయ్ విమానాలు

Iaf jets shoot down pakistani drone that crossed border in rajasthan

Pak drone Bikaner, Pakistan UAV Bikaner, IAF, Indian Air Force, Pak violates airspace, Pok, LoC, Pak drone, International border, Pak Rajasthan border, Pak border Gujarat, Line of Control, kashmir

An unmanned aerial vehicle belonging to Pakistan was on Monday shot down by Indian security forces in Rajasthan's Bikaner, just east of the international border with Pakistan.

పాకిస్తాన్ ద్రోణిని కూల్చిన భారత వాయుసేన దళాలు

Posted: 03/04/2019 08:14 PM IST
Iaf jets shoot down pakistani drone that crossed border in rajasthan

అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా నిలిచిన దాయాధి పాకిస్థాన్ తనను ఈ దశకు తీసుకువచ్చిన భారత్ పై ప్రతీకారంతో రగలిపోతూనే వుంది. ఓ వైపు శాంతిమాటలను వల్లెవేస్తూనే మరోవైపు తన అసలు నైజాన్ని బయటపెట్టుకుంది. పాకిస్తాన్ మరోమారు కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ డ్రోన్‌ను రాజస్థాన్‌లోని బికనీర్ వద్ద సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ కూల్చేసింది. అంతర్జాతీయ సరిహ్దదుకు దగ్గర్లోని ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇవాళ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ కు చెందిన గుర్తు తెలియని ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ ఒకటి భారత గగనతలంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు డ్రోన్ ను గుర్తించగానే.. బికనీర్ నాల్ సెక్టార్ ప్రాంతంలో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ వెంటనే రంగంలోకి దిగి దాన్ని కూల్చేసింది. శకలాలు పాకిస్థాన్ వైపు ఉన్న ఫోర్ట్ అబ్బాస్ సమీపంలో పడిపోయాయి. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ధ్రువీకరించింది.

ఇలాంటి ఘటన అసలేం జరగలేదని పాకిస్థాన్ మీడియా కవర్ చేసే ప్రయత్నం చేసింది. గత వారం గుజరాత్ లోని కచ్ దగ్గర పాక్ డ్రోన్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్లు కూల్చేశాయి. భారత ఎయిర్ ఫోర్స్ జెట్స్ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టిన తర్వాత గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రతీకారంతో రగలిపోతున్న పాకిస్థాన్ భారత్ పై వైమానిక దాడులు చేసేందుకు పలు పర్యాయాలు ప్రయత్నం చేసి విఫలమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IAF jets  Pakistani drone  shoot down  indian air space  bikaner  Rajasthan  

Other Articles