Warangal student Ravali succumbs to burns passes away మృత్యువుతో పోరాడుతూ అనంతలోకాలకు రవళి

Warangal student ravali succumbs to burns passes away

ravali, B,Cs student, Petrol attack, avinash, Yashoda Hospital, warangal, telangana, crime

The woman, Ravali, a B Sc student was set ablaze in full public view by one Avinash, while she was on way to college. The accused had doused her in petrol and set on fire.

మృత్యువుతో పోరాడుతూ అనంతలోకాలకు రవళి

Posted: 03/04/2019 07:55 PM IST
Warangal student ravali succumbs to burns passes away

వరంగల్ లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని తోపుచర్ల రవళి (20) చికిత్స పొందుతూ మృతిచెందింది. 90 శాతానికి పైగా కాలిన గాయాలతో హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి ఆరోగ్యం ఇవాళ సాయంత్రానికి మరింత విషమించింది. దీంతో మృత్యువుతో పోరాడుతూ ఆమె ప్రాణాలు విడిచింది. రవళి మృతితో యశోధా అసుపత్రిలో విషాదవాతావరణం అలుముకుంది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి.

హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతున్న రవళిపై ఫిబ్రవరి 27న అవినాష్ అనే యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. రవళితో మాట్లాడుతున్నట్లు నటించిన అవినాష్.. ఒక్కసారిగా దారుణానికి తెగబడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. మంటల్లో కాలిపోతూ రవళి ఆర్తనాదాలు పెట్టింది. రక్షించాలంటూ కేకలు వేసింది.

తీవ్రమైన బాధను అనుభవిస్తూనే తన వివరాలు, దాడి చేసిన యువకుడి వివరాలు చెప్పి కుప్పకూలింది. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు పరుగు పరుగున వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన రవళిని స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రవళి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ravali  B  Cs student  Petrol attack  avinash  Yashoda Hospital  warangal  telangana  crime  

Other Articles