Padma Rao elected as Deputy Speaker of Telangana ఉపసభాపతిగా పద్మారావు ఏకగ్రీవ ఎన్నిక..

Padma rao goud elected as telangana assembly deputy speaker

T.Padma rao, deputy speaker, former excise minister, Telangana Assembly, Hyderabad, KCR, Pocharam Srinivas Reddy, Telangana, Politics

Former Minister T Padma Rao has been elected unopposed as the deputy Speaker of the Telangana Legislative Assembly. Telangana chief minister KCR has expressed happiness and appreciated him

పద్మారావు ఎన్నిక ఏకగ్రీవం.. అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్..

Posted: 02/25/2019 11:12 AM IST
Padma rao goud elected as telangana assembly deputy speaker

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా కేటీఆర్ ప్రతిపక్ష నేతలతో జరిపిన దౌత్యం ఫలించడంతో పద్మారావు ఎన్నిక ఏకగీవ్రం అయ్యింది. ఇవాళ సభ ప్రారంభమైన తరువాత ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనావాస్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపింది. ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్‌పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ తుది నిర్ణయం శనివారం ఉదయం వెల్లడిస్తామని ప్రకటించింది. సోమవారం ఎన్నిక జరగడంతో డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఉపసభాపతి పద్మారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సభలో ఆయన మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుంచి పద్మారావుతో తనకు మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు. 2001లో కార్పొరేటర్ పదవిని వదులుకుని టీఆర్ఎస్ లో పద్మారావు చేరారని... జంటనగరాల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నేత అని కితాబిచ్చారు. జంటనగరాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ఆయన ఒకేలా ఉంటారని అన్నారు. భవిష్యత్తులో పద్మారావు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యేలు, మంత్రులు అభినందనలు తెలిపారు. సభలో సభ్యులంతా పద్మారావు చేసిన సేవల్ని కొనియాడారు. కార్పొరేటర్ గా పద్మారావు ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆయన గతంలో కాంగ్రెస్ యువజన నాయకులుగా కూడా పనిచేశారని గుర్తు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా పద్మారవుపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పద్మారావు చురుకుగా పాల్గొన్నారన్నారు. పార్టీ నేతలు, ప్రజలంతా పద్మారావును పజ్జిన్న అని అప్యాయంగా పిలుచుకుంటారని హరీష్ తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన పద్మారావుకు శుభాకాంక్షలు తెలిపారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T.Padma rao  deputy speaker  Telangana Assembly  KCR  Pocharam Srinivas Reddy  Telangana  Politics  

Other Articles