Jagan's Gruhapravesam on Feb 27th గుంటూరులో వైఎస్ జగన్ నివాసమిదే.. 27న గృహప్రవేశం..

Ys jagan house warming ceremony in tadepalli on 27 february

YS Jagan, YS Jagan tadepalli house, YS Jagan Amaravati house, YS Jagan KCR, YS Jagan Amanchi, YS Jagan daggupati, YS Jagan chandrababu, YS Jagan New House Warming, Chandrababu, KCR, Politics

YSR Congress Party chief and leader of opposition YS Jagan Mohan Reddy is going to conduct the house warming ceremony on 27 February for his newly constructed house at Tadepalli in Guntur district.

గుంటూరులో వైఎస్ జగన్ నివాసమిదే.. 27న గృహప్రవేశం..

Posted: 02/25/2019 02:20 PM IST
Ys jagan house warming ceremony in tadepalli on 27 february

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిని గృహప్రవేశ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వాస్తవానికి ఫిబ్రవరి 14న ఉదయం 8.21 నిమిషాలకు గృహప్రవేశం చేయాలని ముహూర్తం ఖరారు చేసినా.. కుటుంబ పరమైన కారణాలతో గృహ ప్రవేశాన్ని వాయిదా వేస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత జగన్ లండన్ వెళ్లడంతో దీనికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

తాజాగా దీనికి మరో తేదీని ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ బుధవారం ( ఫిబ్రవరి 27న ) జగన్ కొత్త ఇంటి గృహ ప్రవేశం చేయనున్నారు. అదే రోజు పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీకి చెందిన ముఖ్య నేతలతో పాటు, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు రావాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం.

అలాగే, ఇదే రోజున ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి సహా పలువురు కీలక నేతలు వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జగన్ గృహప్రవేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్.. కూడా హజరుకానున్నారు. ఇక ఇక్కడి ఈ ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు కూడా జరగనున్నాయని సమాచారం. గతంలో చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడి నుంచి నాంది పలకునందన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  tadepalli  New House Warming  Chandrababu  KCR  Politics  

Other Articles