Youth backbone of Jana Sena Party: Pawan జనసేన ప్రజల పార్టీ.. నేను ప్రజల మనిషిని.. మార్పు సాథ్యం..

Pawan kalyan vows complete change in politics in state

pawan kalyan, janasena, pawan kalyan kurnoool road show, jana sena kurnool road show, pawan kalyan change in politics, pawan kalyan chandrababu, pawan kalyan ys jahan, kurnool, kondareddy burugu, Jana Sena Kurnool Road show,, andhra pradesh, politics

Jana Sena chief Pawan Kalyan lamented that Rayalaseema was lagging in development for many decades despite having great history and providing several chief ministers of the state.

ITEMVIDEOS: జనసేన ప్రజల పార్టీ.. నేను ప్రజల మనిషిని.. మార్పు సాథ్యం..

Posted: 02/25/2019 10:35 AM IST
Pawan kalyan vows complete change in politics in state

తాను ప్రజల మనిషిని అని, పార్టీల మనిషిని కాదని జనసేన పార్టీ కూడా ప్రజల పార్టీ అని.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ అనునిత్యం ప్రజల వైపే ఉంటుందని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకేనన్న ఆయన సమాజంలో మార్పురావాలని ప్రజలకు అనిపిస్తేచాలని, ‘జనసేన’ వారికి అండగా ఉంటుందన్నారు. ఆ మహాత్కార్యంలో తన ప్రాణాలు కోల్పోయినా భయపడనని అన్నారు. ఎంతటి మహత్కార్యమైనా ఒక్కరితోనే ప్రారంభం అవుతుందని, ఒక్కరు.. ఒక్కరుగా మీరు కలిస్తే.. మార్పు ఎందుకు సాథ్యం కాదని ఆయన అన్నారు.

అవినీతి కోటలను బద్దలు కొట్టి కొత్త ప్రపంచాన్ని తీసుకొద్దామని, ‘మనం లేకుండా ఏపీ రాజకీయాలు ఉండవు’ అని పవన్ వ్యాఖ్యానించారు. కర్నూలులో సి. క్యాంపు సెంటర్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్ షో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికలు చాలా కీలకమని, అందరినీ సమానంగా భావించే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని పిలుపు నిచ్చారు. కులాలను విడదీసి రాజకీయం వద్దని పిలుపునిచ్చిన ఆయన కులాలను కలిపి రాజకీయం చేద్దామని అదే జనసేన ఉద్ద్యేశ్యమని అన్నారు. రాయలసీమ అభివృద్ధి ‘జనసేన’తోనే సాధ్యమని అన్నారు.

ఈ సందర్భంగా పవన్ అధికార ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించారు. జగన్ లా తాను 30 ఏళ్లు సీఎంను కావాలనుకోవడం లేదన్నారు. జనసేనలోకి ఆ ఎంపీ రావాలని, ఈ ఎంపీ రావాలని తాను కోరుకోవడం లేదని పరోక్షంగా వైసీపీ పార్టీని టార్గెట్ చేశారు. అదే సమయంలో అధికార పక్షాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై పవన్ సంచలన విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబులా తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సొమ్మేమీ ఆయన జేబులోనిదో, టీడీపీ పార్టీ నేతలదో కాదని అన్నారు.

ప్రభుత్వ సొమ్మునే ఇస్తూ ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తానైతే అమలు చేయగలనని పూర్తిగా నిర్ధారించుకున్నాకే ఏదైనా హామీ ఇస్తానని స్పష్టం చేశారు. అధికార, ప్రతిపక్ష నేతల మేనిఫెస్టోలు చూస్తుంటే సిగ్గేస్తోందని పవన్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ కు రెండింతల వరకు హామీలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్ లా తాను దిగజారుడు రాజకీయాలు చేయనని, అబద్ధాలు చెప్పబోనని పవన్ స్పష్టం చేశారు. ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుందని, అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.

కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలన్నదే తన తాపత్రయమని పేర్కొన్నారు. ప్రజలను కులమతాల వారీగా విడదీసి హామీలు ఇవ్వడం సరికాదన్న పవన్.. తాను కులాలను ఏకం చేసే రాజకీయాలు చేస్తానన్నారు. తనకు కాన్షీరాం ఆదర్శమని పవన్ పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే తన పోరాటమని, గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారో, ప్రతిపక్షంలో కూర్చోబెడతారో మీ ఇష్టమని ప్రజలకే అప్షన్ ను ఇచ్చారు. అయితే మరో మూడు నెలల తరువాత నుంచి జనసేన లేకుండా భవిష్యత్ రాజకీయాలు ఉండబోవని కొండారెడ్డి బురుజు సాక్షిగా చెబుతున్నానని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles