EX Karwan MLA Baddam Bal Reddy passed away బిజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

Bjp senior leader baddam bal reddy passed away

Baddam Bal Reddy, Baddam Bal Reddy death, Baddam Bal reddy passed away, Baddam Balreddy political career, Baddam Balreddy news, BJP Leadar Baddam, Golconda Tiger, Golconda Tiger Baddam Bal Reddy, Baddam Bal Reddy intestine cancer, politics

BJP leader, EX Karwan MLA Baddam Bal Reddy had his last breath today in a private hospital today noon. The Golconda Lion had been undergoing treatment for his intestine cancer since few months. He represented from karwan constutiency for 3 times.

గోల్కోండ సింహం బిజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

Posted: 02/23/2019 04:37 PM IST
Bjp senior leader baddam bal reddy passed away

సీనియర్ బీజేపీ నేత, మాజీ బీజేపి ఎమ్మెల్యే, గోల్కండ సింహం బద్దం బాల్ రెడ్డి ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన అరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం చెంది ఆయన కన్నుమూశారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన.. గత ఎన్నికలలోనూ రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి గెలిచి ఓటమిపాలయ్యారు.

హైదరాబాద్‌ లోని ముస్లిం ప్రభావిత ప్రాంతాలలో బీజేపీ పార్టీని బలోపేతం చేసిన వారిలో ఆయన ముఖ్యుడు. మైనారిటీ ప్రభావం ఉన్న ఏరియాలో కూడా ఆయన కాషాయజెండా ఎగరేయగలిగారు. అభిమానులు అందరూ ఆయన్ను గోల్కొండ సింహం అని పిలుచుకుంటారు. బద్దం బాల్‌రెడ్డి మూడుసార్లు ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985, 1989, 1994లో కార్వాన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

2004లో ఆయన మీద హత్యాయత్నం జరిగింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వద్ద ట్రైనింగ్ పొందిన కొందరు ఆయనపై హత్యాయత్నం చేశారు. అయితే, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ కేసులో నిందితుడు జకీర్ రహీమ్‌ను 2017 పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ఫర్హతుల్లా పరారీలో ఉన్నాడు. గత కొంతకాలంగా పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు సీరియస్ కావడంతో కుటుంబసభ్యులు బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP Leader  Golconda Tiger  baddam bal reddy  passed away  karwan  Politics  

Other Articles