Sabbam Hari key comments on his Political Future పచ్చ కండువా తప్ప.. ప్రత్యామ్నాయం లేదు: సబ్బంహరి

Former mp sabbam hari key comments on his political future

Sabbam Hari, Former MP Sabbam Hari, Sabbam Hari Political Future, Sabbam Hari Amaravati, Sabbam Hari polavaram, Sabbam Hari TDP, Sabbam Hari politics, Sabbam Hari Chandrababu, TDP, Politics

Former MP Sabbam Hari key comments on his Political Future, says if he wants to be active in politics there is no other alternative than joining TDP party.

పచ్చ కండువా తప్ప.. ప్రత్యామ్నాయం లేదు: సబ్బంహరి

Posted: 02/23/2019 11:49 AM IST
Former mp sabbam hari key comments on his political future

నెగెటివ్ రాజకీయాలు చేసే వ్యక్తుల కంటే పాజిటివ్ రాజకీయాలు చేసే వ్యక్తులకు విలువ ఉంటుందని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలకు మాత్రమే పనికొస్తారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రజలందరికీ తెలిసే మాదిరిగానే ప్రయత్నించారని.. అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారని పేర్కొన్నారు. చంద్రబాబువి పాజిటివ్ పాలిటిక్స్ అని పేర్కొన్న సబ్బంహరి.. మోదీని చంద్రబాబు టార్గెట్ చేయడం వల్లే ఇక్కడి రాజకీయాల్లో మార్పు వచ్చిందని అన్నారు.

గత ఎన్నికల్లో బీజేపీకి 270కి పైగా స్థానాలు వచ్చాయని, ఈసారి 150-160 స్థానాలకు పడిపోతుందని జోస్యం చెప్పారు. ఇక, ఏపీలో బీజేపీ అసలు ఖాతా కూడా తెరవదని అన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం అంటూ ఏర్పడితే చంద్రబాబు కీలకం అవుతారని సబ్బంహరి పేర్కొన్నారు. ఇక తన రాజకీయ భవితవ్యంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన తనకు పచ్చ కండువా కప్పుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని అన్నారు. లేనిపక్షంలో రాజకీయాల నుంచి తప్పుకోవడమే సముచితమన్నారు.

ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని పేర్కోన్న సబ్బంహరి.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే రాజధాని నిర్మాణ పనులతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులు కుంటుపడిపోతాయన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీకే అనుకూల వాతావరణం ఉందన్న హరి.. రాజధానిలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.

రాజధాని నిర్మాణానికి గతంలో భూములు ఇవ్వబోమన్న ఉద్దండరాయపాలెం రైతులు ఇప్పుడు అభివృద్ది శరవేగంగా సాగుతున్న క్రమంలో వందశాతం భూములు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబుపై రాష్ట్ర ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, పెద్దవాడు, గౌరవంగా మాట్లాడతాడన్న భావన కొన్ని వర్గాల్లో ఉందని హరి అన్నారు. ఆయన మాత్రమే ఈ మాత్రమైనా అభివృద్ధి చేయగలిగాడని మరికొందరు అనుకుంటున్నారని పేర్కొన్నారు. వడ్డించే విస్తరిలాంటి పరిస్థితిని చిందరవందర చేసుకోకూడదని మరో వర్గం ప్రజలు భావిస్తున్నారని హరి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sabbam Hari  active politics  Amaravati  polavaram  Chandrababu  TDP  Politics  

Other Articles