HC notices to BalaKrishna for distributing Money బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

Hc notices to balakrishna for distributing money in nandyal bye poll

Andhra Pradesh High Court, YSRCP leader, Advocate, Nandamuri Balakrishna, Hindupuram MLA, Election Commission, CEC Notices, Nandyal bye-polls, kurnool collector, Money distribution to voters, Politics

A YSRCP leader and Advocate has moved the Andhra Pradesh High Court seeking action from the Election Commission against actor-politician Nandamuri Balakrishna, for allegedly distributing money during the Nandyal bye-election campaign.

నంద్యాల ఉపఎన్నిక: డబ్బు పంఫిణీలపై బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

Posted: 02/23/2019 11:07 AM IST
Hc notices to balakrishna for distributing money in nandyal bye poll

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 16 ఆగస్టు 2017న నిర్వహించిన రోడ్‌ షోలో బాలకృష్ణ.. ఓటర్లకు డబ్బులు పంచారంటూ.. అప్పట్లో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె. శివకుమార్ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై అప్పట్లో రాష్ట్ర ఎన్నికల అధికారి బాలకృష్ణ డబ్బులు పంచారన్న వార్తలను ఖండిచారు. బాలకృష్ణ తమ పార్టీ కరపత్రాలను పంచారని చెప్పారు.

అయితే బాలకృష్ణ బాహాటంగా డబ్బులు పంచుతూ మీడియాకు చిక్కిడంతో ఆ క్లిప్లింగ్స్ తో పాటుగా బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పిటిషనర్ పేర్కొన్నారు. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల బెంచ్.. గతంలో ఏమైనా నోటీసులు జారీ చేశారా? అని ప్రశ్నించింది. పిటిషనర్ లేదని చెప్పడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, కర్నూలు కలెక్టర్ తోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది.

అయితే ఆగస్టు 29 2017 నాడు న్యాయవాది, వైసీపీ నేత కె.శివకుమార్ న్యాయస్థానంలో పిటీషన్ వేయగా, ఇన్నాళ్లు న్యాయస్థానంలో పెండింగ్ లో వున్న పిటీషన్ తాజాగా తెరపైకి రావడం.. బాలకృష్ణకు నోటీసులను పంపడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాదిన్నర కాలం తరువాత ఈ కేసు తెరపైకి రావడంతో దీని వెనుక కూడా అదృశ్యశక్తుల ప్రభావం వుందా.? అన్న అనుమానాలను తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles