KTR meets Congress Leaders ఉత్తమన్నా.. మీ నెంబర్ బ్లాక్ చేయలేదు: కేటీఆర్

Assembly deputy speaker election ktr meets congress leaders

Assembly deputy speaker, deputy speaker election, T.Padma Rao, TRS working President, KTR meets CLP leaders, KTR meets congress Leaders, KTR Uttam kumar Reddy, KTR Batti Vikramarkha, MLC Election, Phone Number Block, Politics

Assembly deputy speaker election: In view of Assembly deputy speaker election TRS working President KTR meets Congress Leaders and urges to give support and make the election unanimous.

కేటీఆర్ తో కాంగ్రెస్: ఉపసభాపతికి కండీషనల్ సపోర్ట్

Posted: 02/23/2019 12:35 PM IST
Assembly deputy speaker election ktr meets congress leaders

శాసనసభ ఉపసభాపతి ఎన్నికలో తమ మద్దతు కోరేందుకు వచ్చిన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు కాంగ్రెస్ కండీషనల్ సపోర్టు ఇచ్చింది. శాసనసభ ఉపసభాపతిగా తాము బరిలో నిలిపిన అభ్యర్థి టి.పద్మారావును బలపర్చాలని కోరుతూ కేటీఆర్ ఇవాళ ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు కూడా ఏకగ్రీవం చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. విపక్ష పార్టీలకు చెందిన నేతలను కలిసి వారి మద్దతు కూడగడుతోంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎల్పీ నేతలు కూడా తమ కండీషన్ కేటీఆర్ ఎదుట పెట్టారు. ఇవాళ ఉదయం 9.40 గంటల ప్రాంతంలో మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసిరాగా, శాసనసభ ప్రారంభం కావడంతో మంత్రులు అక్కడి నుంచి సభలోకి వెళ్లారు.

అదే సమయంలో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కూడా సీఎల్పీ కార్యాలయంలోకి రావడంతో, భట్టి విక్రమార్కతో కలిసి ముగ్గురూ ఏకాంతంగా చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ ముందు తమ కండిషన్ ను పెట్టారు. ఎమ్మెల్సీల ఎన్నికలలో భాగంగా తమకు లభించే ఒక్క స్థానం విషయంలో అధికార పార్టీ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్, ఉత్తమ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన నంబర్‌ ఎందుకు బ్లాక్ చేశారంటూ కేటీఆర్‌ను ఉత్తమ్ సరదాగా ప్రశ్నించారు. అందుకు కేటీఆర్.. తాను కేవలం మెసేజ్‌లు మాత్రమే చూస్తానని.. ‘మీ నెంబర్ బ్లాక్ చేయలేదు’ అంటూ సమాధానమిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles