AIADMK MP S Rajendran dies in car accident రోడ్డు ప్రమాదంలో ఎంపీ రాజేంద్రన్ దుర్మరణం

Villupuram mp s rajendran killed in road accident in tn

aiadmk mla,S Rajendran,villupuram,Tindivanam,Anbuselvam,s. rajendran accident,ulundurpet,villupuram to chennai,vgk mani,trichy to villupuram distance,kanchipuram collector name,vellore collector name,erode collector name,dharmapuri medical college,sengottaiyan caste,chennai north,chennai to tiruvallur distance,tiruvannamalai collector name,salem collector name, Politics

AIADMK Member of Parliament S.Rajendran(62) from Villupuram was killed in a road accident in Tindivanam. According to police, the accident took place at around 6.30 a.m.

రోడ్డు ప్రమాదంలో విల్లూపురం ఎంపీ రాజేంద్రన్ దుర్మరణం

Posted: 02/23/2019 10:27 AM IST
Villupuram mp s rajendran killed in road accident in tn

తమిళనాడు విల్లుపురం లోక్‌సభ సభ్యుడు, అన్నాడీఎంకే పార్టీకి చెందిన రాజేంద్రన్‌ ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా తిండివనమ్‌ సమీపంలో రోడ్డుపై ఉన్న స్టాప్ బోర్డును తప్పించే ప్రయత్నంలో ఆయన కారు డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో ప్రమాదం సంభవించి రాజేంద్రన్ మరణించారు.  

ఇవాళ ఉదయం 6.30 గంటలకు జరిగిన ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం విషయం తెలుసుకున్న అక్కడకు విచ్చేసిన అన్నాడిఎంకే కార్యకర్తలు ఆయన చనిపోయినట్లు గుర్తించారు. రాజేంద్రన్‌ హఠాన్మరణంపై ఏఐడీఎంకే పెద్దలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఆయన ఇలా మరణించడం తీరని లోటని పార్టీ వర్గాలు పేర్కోన్నాయి.

జక్కంపెట్టాయి అతిథిగృహంలో తన సహచరులు, పార్టీ ప్రతినిధులను కలిసిన అనంతరం ఎంపీ ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంపీ రాజేంద్రన్‌ ఘటనాస్థలిలోనే చనిపోయారు. ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు ఎంపీ సహాయకుడు తీవ్రగాయాలతో బయటపడ్డారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విల్లుపురం నియోజకవర్గం నుంచి రాజేంద్రన్ ఏఐడీఎంకే తరపున పోటీ చేసి గెలుపొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aiadmk mla  S Rajendran  accident  villupuram  Tindivanam  Anbuselvam  Politics  

Other Articles