mamta banerjee gets shiv sena support మమత దీక్షకు పెరుగుతున్న విపక్షాల మద్దతు

West bengal cm mamta benarjee gets oppsition parties support

sanjay raut, raj thackery, gulam nabi azad, arvind kejriwal, cbi, kolkata police, Rajeev Kumar, west bengal cm, chief minister, mamata banerjee, president rule, rajnath singh, keshari nath tripathi, saradha scam, prakash javadekar, beran singh, supreme court, politics

Throughout the day, support continued to pour in from opposition leaders from across the country for Banerjee. From Congress chief Rahul Gandhi to PDP chief Mehbooba Mufti, all leaders expressed solidarity with ‘Didi’.

మమత దీక్షకు పెరుగుతున్న విపక్షాల మద్దతు

Posted: 02/04/2019 05:42 PM IST
West bengal cm mamta benarjee gets oppsition parties support

సీబీఐ తీరుకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు విపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పడికే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రీవాల్, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు తమ మద్దతును ప్రకటించగా, తాజాగా శివసేన కూడా మమత బెనర్జీకి మద్దతు ప్రకటించింది. సీబిఐని కేంద్రంలోని బీజేపి పార్టీ వారికి అనుకూలంగా లేని రాష్ట్రాలపై ప్రయోగిస్తుందని అరోపించింది.

శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రావత్‌ మమతా బెనర్జీ ప్రభుత్వానికి తన మద్దతును ప్రకటించారు. ‘‘సీబీఐని దుర్వినియోగం చేయడం దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. ఏదైనా అక్రమం జరిగిందని భావిస్తే ముందుగా తెలియజేయాలి. ఎమర్జెన్నీ సమయంలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లిందని భావించిన ప్రజలు ఇందిరాగాంధీని ఓడించారు. ఈ సంఘటన తర్వాత ఏం చేయాలో ప్రజలకు తెలుసు’’ అని సంజయ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఆ తరువాత మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన అధినేత రాజ్‌ ఠాక్రే స్పందిస్తూ.. ‘‘మమతా చేస్తున్న పోరాటాన్ని మేం అభినందిస్తున్నాం. కేంద్రప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ విషయంలో ఆమె వెనకాల నడవడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు. సీబిఐలో తమ మాట వినని అధికారులను తప్పించి.. తమ చెక్కుచేతల్లోని అధికారులను నియమించి.. కేంద్రం పలు నాటకాలకు తెరతీస్తుందని ఆయన విమర్శించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం తన సంఘీభావం ప్రకటించారు. ‘‘బెంగాల్‌ ఘటన రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిపై దాడి చేయడమే. మేం మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్రం సీబీఐని దుర్వినియోగపరుస్తోంది. ఈ విషయంలో ఎస్పీతో పాటు దేశం మొత్తం ఇదే చెబుతోంది. కొంతకాలం క్రితం సీబీఐ డైరెక్టరు వివాదంతో ఆందోళనకు గురైన కేంద్రం ఇప్పుడు సీబీఐని అడ్డం పెట్టుకుని విపక్షాలను బెదిరించాలని చూస్తోంది’’ అంటూ ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ స్పందిస్తూ..‘‘భాజపా అధికారంలోకి వచ్చిననాటి నుంచి విపక్షాలను సాగనంపడంపైనే దృష్టి సారించింది. దేశ ప్రయోజనాల కంటే దీనిపైనే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా మాట్లాడుతూ..‘‘దీదీ చేస్తున్న పోరాటం సమంజసమే. దేశం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ప్రజల నిర్ణయమే అంతిమం. కేంద్రానిది కాదు’’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cbi  kolkata police  mamata banerjee  sanjay raut  raj thackery  gulam nabi azad  arvind kejriwal  politics  

Other Articles