Jeevitha Complains on Uttam's Brother హీరో రాజశేఖర్ తమ్ముడిపై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి దాడి..

Jeevitha complains on uttam s brother

Jeevitha Rajasekhar, gunashekhar, police complaint, PCC Uttam Kumar Reddy, congress leader, Kaushik Reddy, ACP office, Banjara Hills, crime

Jeevitha Rajasekhar has lodged a police complaint against Congress leader Kaushik Reddy, who happens to be the brother of TPCC chief Uttam Kumar Reddy. Jeevitha has filed a complaint with ACP office in Banjara Hills.

హీరో రాజశేఖర్ తమ్ముడిపై కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి దాడి..

Posted: 02/04/2019 07:54 PM IST
Jeevitha complains on uttam s brother

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ జీవిత రాజశేఖర్ బంజారాహిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజశేఖర్ సోదరుడైన గుణశేఖర్ వరదరాజన్ పై కౌశిక్ రెడ్డి రెండు రోజుల క్రితం దాడికి పాల్పడ్డాడని జీవిత ఆరోపించారు. పార్కింగ్ కి సంబంధించిన వివాదమే దాడికి కారణమైందని తెలిపారు.

జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో గుణశేఖర్ నిర్వహిస్తున్న గుణ డైమండ్స్ షోరూమ్ ముందు కౌశిక్ రెడ్డి కారు పార్క్ చేశారని.. అనుమతి లేకుండా పార్కింగ్ చేయడంపై ప్రశ్నించినందుకు.. తిరిగి అతనే దాడికి పాల్పడ్డాడని చెప్పారు. గొంతు నులిమి ఇష్టమొచ్చినట్టు కొట్టాడని చెప్పారు. ఆరున్నర అడుగుల ఎత్తు, చాలా బలిష్టంగా ఉండటంతో అతన్ని ఆపడం కూడా కష్టమైందని భాధితుడు చెప్పాడు. దాడి తర్వాత జ్వరంతో ఆసుపత్రిలో చేరిన తాను ఇవాళ అన్నయ్య రాజశేఖర్‌ తో విషయం చెప్పానని అన్నారు.

అన్నయ్య చెప్పడంతో వదిన జీవితతో కలసి వచ్చిన తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. దాడి దృశ్యాలు సీసీటీవిలో రికార్డయ్యాయని.. పోలీసులకు ఆ ఫుటేజీని సమర్పిస్తామని తెలిపారు. చెప్పకుండా పార్కింగ్ చేస్తే ఎలా అని మర్యాద పూర్వకంగా ప్రశ్నించినందుకే.. అతను ఇష్టారీతిన కొట్టాడని అన్నారు. దాడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా జీవిత రాజశేఖర్‌కు ఏసీపీ సూచించారు. కాగా, దాడికి పాల్పడ్డ కౌశిక్ రెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jeevitha Rajasekhar  gunashekhar  police complaint  Kaushik Reddy  ACP office  Banjara Hills  crime  

Other Articles