WB governor submits report to Rajnath Singh బెంగాల్ పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ నివేదిక..

West bengal governor submits report to home ministry

rajnath singh, keshari nath tripathi, saradha scam, cbi, kolkata police, west bengal cm, chief minister, mamata banerjee, president rule, prakash javadekar, beran singh, supreme court, politics

West Bengal Governor Keshari Nath Tripathi has submitted a report to Union Home Minister Rajnath Singh on the situation that unfolded in the city after a CBI team was allegedly obstructed by the police from questioning Kolkata Police chief Rajeev Kumar in the Saradha scam,

బెంగాల్ పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ నివేదిక..

Posted: 02/04/2019 04:57 PM IST
West bengal governor submits report to home ministry

పశ్చిమబెంగాల్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు నివేదిక పంపినట్టు కోల్ కతాలోని రాజ్ భవన్ వర్గాలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠితో రాజ్ నాథ్ ఫోన్ లో చర్చించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులపై నివేదిక పంపించాలని కోరారు. అయితే నిన్న రాత్రి నుంచి ధర్నాకు దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన దీక్షను కొనసాగిస్తున్నారు.

ఇదిలావుండగా, మమత ప్రభుత్వం తమ అధికారులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో సీబిఐ అధికారులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా సీబిఐ జాయింట్ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని.. ఈ క్రమంలో కేంద్ర సాయుధ బలగాలను ఆ రాష్ట్రంలోకి పంపేందుకు అనుమతించాలని బీజేపి నేతలో ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.

ఇక దేశంలోని వివిధ పార్టీల అగ్రనేతలు ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఫోన్ ద్వారా పరామర్శించి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. బీజేపియేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం తన అధిపత్యాన్ని ప్రదర్శించి.. వారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తుందని ఈ చర్యలు దేశ ఐక్యతకు కూడా విఘాతం కలిగించేవిలా వున్నాయని పలువురు వారు విమర్శించారు. అయితే కేంద్రమంత్రి ప్రకాష్ జావదేకర్ మాత్రం ఇది కేవలం మమతా ప్రభుత్వం తనంతట తానుగా విధించుకున్న ఎమర్జెన్సీగా పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles