treirb Recruitment 2019 Notification for 4165 Vacancies తెలంగాణ గురుకుల పాఠశాల్లో ఉపాధ్యాయ పోస్టులు..

Ts gurukulam recruitment 2019 notification for 4165 vacancies

Junior Lecturer, Mahatma Jyotiba Phule BC Residential School, Telangana BC Welfare Residential collages, Telangana Govt Jobs, Telangana Gurukulam Junior College

Good news for unemployed Youth in Telangana. TS Govt is going to Release TS Gurukulam Notification 2019 to recruit more than 4165 vacant posts in Gurukul Schools across the State. The Recruitment process will complete by this June

తెలంగాణ గురుకుల పాఠశాల్లో ఉపాధ్యాయ పోస్టులు..

Posted: 01/29/2019 12:53 PM IST
Ts gurukulam recruitment 2019 notification for 4165 vacancies

తెలంగాణలో నిరుద్యోగులకు శుభావర్త వచ్చింది. గురుకులాల్లో పోస్టుల భర్తీకి గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 119 మహత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకులాల్లో 4322 పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. ఈ పోస్టుల్ని నాలుగేళ్లలో దశలవారీగా భర్తీ చేయనున్నారు అధికారులు.

వీటిలో రెసిడెన్షియల్ స్కూళ్లలో టీచర్లు, నాన్ టీచింగ్ కలిపి మొత్తం 3689 పోస్టులు మంజూరు చేస్తూ సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల సొసైటీలో పని చేసేందుకు మరో 28 రెగ్యులర్‌, 10 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌తోపాటు బీసీ గురుకులాల్లోని వివిధ కేటగిరీల్లో 595 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిని వచ్చే (2019-20) విద్యా సంవత్సరంలోనే భర్తీ చేయనున్నారు.

అలాగే 1,071 టీజీటీ రెగ్యులర్‌ సహా 1,904 పోస్టులను 2019-20 లో భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతిచ్చింది. మిగతా రెగ్యులర్‌ పోస్టులను దశలవారీగా అధికారులు భర్తీ చేయనున్నారు. వీటికి టీఆర్‌ఈఐఆర్‌బీ (TREIRB) నోటిఫికేషన్‌ జారీ చేయనుండగా.. 595 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను బీసీ గురుకుల సొసైటీ భర్తీ చేయనుంది. వీటిలో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు -238 పోస్టులు, ల్యాబ్‌ అటెండర్లు- 238, ఆఫీస్‌ సబార్డినేట్‌-119. ఇక బీసీ రెసిడెన్షియల్‌ సొసైటీలో డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు 2, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 4, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 4 భర్తీ చేయనున్నారు.

మరోవైపు భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 1,948 ఖాళీలు భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ జారీచేయనుంది. ఇందులో 137 గ్రూప్‌-1, 339 గ్రూప్‌-3 ఉద్యోగాలున్నాయని టీఎస్‌పీఎస్సీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మీద తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతుండటంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles