man arrested for secretly filming girls in metro కురుచ దుస్తుల్లో అమ్మాయిల రహస్యంగా వీడియో..

Man arrested for secretly filming girls wearing short clothes in metro

chennai metro, man took abuse video, man arrested, Chennai City, Metro, abuse, Women dress code, women safety, crime

A 45-year-old man was arrested for filming a group of girls without their permission. The incident took place at the Vadapalani station after the group of quick thinking girls identified him by a reflection in the train glass.

మెట్రో ట్రైన్లో కురుచ దుస్తుల్లో అమ్మాయిల రహస్యంగా వీడియో..

Posted: 01/29/2019 12:02 PM IST
Man arrested for secretly filming girls wearing short clothes in metro

ఐదుగురు అమ్మాయిలు కురుచ దుస్తులతో మెట్రో రైలులో ప్రయాణం చేయడం.. వారిని రహస్యంగా వీడియో తీసీన ఓ వ్యక్తిని కటకటాల వెనక్కు నెట్టింది. అయితే ఇక్కడ విద్యార్థినుల చాకచక్యత అమోఘంగా పనిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. కొయంబేడు నుంచి చెన్నై ఎయిర్ పోర్టు వరకు ఐదుగురు అమ్మాయిలు సరదాగా మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు. మెట్రో రైలు ప్రయాణంలో అద్దాల నుంచి కిందకు చూస్తు వారు సంతోషంలో వుండగా, వారికి ఎదురుగా కూర్చున్న సుమారు 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మాత్రం తన పనిలో తాను వున్నాడు.

అమ్మాయిలు కురుచ దుస్తులు ధరించడమే పాపం అన్నట్లుగా వారిని తన చేతిలో మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు, ఫోటోలు తీయడం ప్రారంభించాడు. తని వ్యవహారంపై అమ్మాయిలకు అనుమానం కలిగినా.. దానిని నిర్ధారించుకునేందుకు అతని వెనుకున్నమెట్రో ట్రైన్ గ్లాస్‌లో చూశారు. అద్దంలో అది రిఫ్లక్ట్ కావడంతో అతను తమ వీడియోలు, ఫోటోలనే తీస్తున్నాడని నిర్థారణ అయ్యింది. దీంతో ఇక అగలేకపోయిన అమ్మాయిలు సదరు వ్యక్తిని నిలదీశారు.

అంతే అతడిచ్చిన సమాధానంతో అమ్మాయిలే కాదు రైలులో వున్న అందరూ అవాక్కయ్యారు. మీరు పొట్టిపొట్టిగా, అసభ్యకరమైన కురుచ దుస్తులను ధరిచడం తప్పలేదు కానీ మిమల్ని ఫోటోలు, వీడియోలు తీస్తే తప్పెందుకు అవుతుందని ఆతగాడు దురుసుగా సమాధానం ఇచ్చాడు. దీంతో రగలిపోయిన అమ్మాయిలు వడపలాని స్టేషన్ వద్ద మెట్రో కంట్రోల్ రూంలో ఫిర్యాదు చేశారు. అమ్మాయిల పిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

అమ్మాయిల ఫొటోలు తీసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు అన్నానగర్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి అని, అతని పేరు దినేష్ గా గుర్తించిన పోలీసులు అతడి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని ఫోన్‌లో ఆ అమ్మాయిల అసభ్యరమైన ఫోటోల్ని, వీడియోల్ని గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి సెల్ ఫోన్ ను కూడా సీజ్ చేశారు. చెన్నై మెట్రోలో సీసీటీవీలు ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు పునారావృతం అవుతున్నాయని మరీ ముఖ్యంగా మహిళా ప్రయాణికులు పిర్యాదు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles