HC gives green signal for construction of New Secretariat నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి తొలగిన అడ్డంకీ..

High court gives green signal for construction of new secretariat

New Secretariat, bison polo ground, High Court, petition, KCR, Union Government, Telangana, Politics, Telangana government, Politics

The Telangana High Court suaqsh the petition, submited before it mentioning not to hand over the bison polo land to telangana government, today. By this a hectakle has been cleared for the state government in constuction on new secretariat.

నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి తొలగిన అడ్డంకీ..

Posted: 01/29/2019 01:35 PM IST
High court gives green signal for construction of new secretariat

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి సెక్రటేరియట్ గా సేవలందించిన ట్యాంకుబండ్ పక్కనున్న సచివాలయం మరికొన్ని రోజుల్లో చరిత్రకు పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఆ సచివాలయంలో వాస్తు దోషం వున్నదన్న నేపథ్యంలో మరో నూతన సచివాలయం నిర్మాణానికి నాంది పలికిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి. వాస్తు దోషం మాట అటుంచితే.. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ చరిత్రలో తనకంటూ ఓ పేజీని ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంతో మరో పేజీని కూడా రచించుకునేందుకు ఆటంకాలు తొలగిపోయాయి.

బైసన్ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఇది పూర్తిగా క్రీడా మైదానమని... ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దంటూ కొందరు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో బైసన్ పోలో గ్రౌండ్స్‌కు సంబంధించిన భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే విషయంలో కేంద్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.

మైదనం కన్న రాష్ట్రానికి సచివాలయం ముఖ్యమని అది అందరికీ అమోదయోగ్యమైన ప్రదేశంలో వుండటం సముచితమని భావించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ పిటీషన్ ను తోసిపుచ్చింది. దీంతో నూతన సచివాలయ నిర్మాణానికి వున్న అడ్డుంకుటు తొలగిపోయాయి. ఈ మైదానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ కొద్ది రోజుల్లోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

బైసన్ పోలో గ్రౌండ్స్ కు సంబంధించిన 22 ఎకరాలతో పాటు జింఖానా మైదానానికి సంబంధించిన మరో 15 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అడ్డంకులు తొలిగిన నేపథ్యంలో సముహర్తాన్ని చూసి కేసీఆర్ ప్రభుత్వం ఈ మేరకు నిర్మాణాలను ప్రారంభించనుంది. కాగా, బైసన్ పోలో గ్రౌండ్స్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కొన్నేళ్ల క్రితమే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం... ఇందుకు సంబంధించి ప్లాన్ ను కూడా సిద్ధం చేసింది.

నిర్మాణ మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే సచివాలయం నిర్మాణం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది. కొత్త సచివాలయంతో పాటు ఇదే ప్రాంగణంలో కళాభారతిని కూడా నిర్మించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. పాత కట్టడాల తరహాలో కొత్త సచివాలయ నిర్మాణం ఉండేలా డిజైన్ రూపొందించారు. మొదట్లో రూ. 175 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణం జరపాలని భావించిన ప్రభుత్వం... ఎంత ఖర్చయినా వెనకడాకుండా కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles