Jet Fuel costs less than Petrol and Diesel సామాన్యులకు 14.18 సంపన్నులకు 18.3..

Jet fuel price slashed by 14 7 cheaper than petrol diesel

Aviation turbine fuel, ATF, ATF price cut, Jet fuel price cut, ATF rates today, petrol, diesel, white petrol, oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Jet fuel price was cut by 14.7 percent, a record number which now marks the price of ATF (Aviation Turbine Fuel) cheaper than both petrol and diesel.

డీజీల్, పెట్రోల్ కన్నా విమాన ఇంధనం చౌక..అదెట్టా..?!

Posted: 01/02/2019 02:29 PM IST
Jet fuel price slashed by 14 7 cheaper than petrol diesel

దేశంలోని వాహనాలు వాడే ఇంధన ధర కన్నా విమానాలు వాడే ఇంధన ధరలు చౌకగా నమోదు కావడం దేశ ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే మోడీ సర్కార్ సంపన్నుల పక్షాన నిలుస్తుందని.. సామాన్యులకు నామమాత్రపు లబ్దిని మాత్రమే చేకేర్చుతుందన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో తాజాగా పెట్రోల్ ధరల అంశం కూడా అందుకు ఊతమిస్తున్నాయి. విమానాలు వాడే వైట్ పెట్రోల్ ధర సామాన్యులు వాడే పెట్రోల్ ధర కన్నా అధికంగా వుండటం పరిపాటి. అయితే మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా వుండటమే చర్చనీయాంశంగా మారింది.

అంతర్జాతీయమార్కెట్లో నెలకొన్న పరిణామాలతో క్రూడాయిల్ ధర గణనీయంగా తగ్గగా, తదనుగూణంగా తగ్గాల్సిన ఇంధన ధరలు దేశంలోని వాహనదారులకు అందుబాటులోకి రాకపోవడంతో వారు ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థలపై మండిపడుతున్నారు. ఇదే క్రమంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ సంపన్నులు మాత్రమే తిరిగే విమానాలకు, విమానయాన సంస్థలకు లబ్ది చేకూర్చుతూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ ధరలను మాత్రం అమాతం తగ్గించింది. గత నెల 1న సుమారుగా పదిశాతం మేర తగ్గిన ఏటీఎఫ్ ధర తాజాగా మరోమారు భారీగా తగ్గించింది కేంద్రం.

ప్రస్తుతం ఏటీఎఫ్ కిలో లీటర్ల ధర రూ. 58,060లకు చేరడంతో ఇది దేశంలోని వాహనదారులకు అందే పెట్రోల్ ధర కన్నా తక్కువగా వుంది. ఇక ముంబై సహా పలు ప్రాంతాల్లో లభించే బహిరంగ మార్కెట్లో లభించే కిరోసిన్ ధర కన్నా అధికంగా వుందని పలువురు పెదవి విరుస్తున్నారు. విమాన సంస్థలకు లాభాలను అందించేందుకు మోడీ సర్కార్ ఏకంగా 58 రూపాయలకు లీటరు ఏటీఎఫ్ ను అందిస్తుంది. అయితే నిత్యవాసరాల సరుకులను రవాణా చేసే అన్ని వాహనాలు డీజిల్ నే వాడుతున్నా దాని ధర కూడా ఏటీఎఫ్ కన్నా అధికంగా వుంది.

పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగూణంగా తగ్గిస్తామని చెప్పిన ఇంధన సంస్థలు సామాన్యుల జేబులు కొట్టి సంపన్నులు తిరిగే విమానాలకు, విమానయాన రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు లబ్దిని చేకూర్చుతున్నారన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి. సామాన్యులు ఎన్నో వ్యవప్రయాసలకోర్చి తమ బతుకుబండి నడిపించేందుకు తప్పనిసరై వాహనాలలో ఇంధనాన్ని వినియోగించుకుంటున్నా.. పారిశ్రామిక వేత్తలుగా అవతారంలో విమాన సంస్థలు లాభాలను పిండుకుంటున్నాయన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

ప్రస్తుతం విమాన ఇంధన ధర లీటరుకు రూ. 58.07కు చేరడంతో విమానయాన సంస్థలు లాభాలబాటలో నడుస్తుండగా, ఇటు వాహనదారులు మాత్రం పెట్రోల్ ధరల పెంపుపై రుసరుసలాడుతున్నారు. వాహనదారులు వాడే ఇంధన ధరలు అకాశానంటుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 73కు అటూఇటుగా ఉంది. అంటే, విమాన ఇంధనంతో పోలిస్తే, పెట్రోలు ధర లీటరుకు రూ. 15 అధికంగా ఉన్నట్టు. డీజిల్ ధర రూ. 68గా ఉండగా, అది కూడా విమాన ఇంధన ధరతో పోలిస్తే రూ. 10 అధికంగా ఉన్నట్టు.అక్టోబర్ 18 నుంచి తగ్గుముఖం పట్టిన ధరలు.. ఇప్పటివరకూ లీటరు పెట్రోలుపై రూ. 14.18, డీజిల్ పై రూ. 13.03 మేరకు మాత్రమే తగ్గాయి. అయితే ఏటీఎప్ అందించే ఇంధన మాత్రం డిసెంబర్ ఒకటిన రూ.8.4 మేర, తాజాగా 9.90 మేర తగ్గి ఏకంగా నెల రోజుల వ్యవధిలో 18.3 మేర తగ్గించడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aviation turbine fuel  ATF price cut  ATF rates  oil price  crude oil  petrol  diesel  

Other Articles