SC Says No To Andhra HC Advocates Plea ఆంధ్ర న్యాయవాదులకు చుక్కెదురు.. జోక్యం చేసుకోలేమన్న ‘సుప్రీం’..

Sc says no to andhra hc advocates plea for time to shift from hyderabad

Hyderabad high court bifurcation, AP High Court, AP High Court Advocates Association, Supreme Court, Andhra Pradesh High Court, Amaravati, Telangana High Court, Lawyers Emotional moments hyderabad, Vijayawada, Telangana, Andhra Pradesh, amravati

The Supreme Court declined to entertain a petition filed by the AP High Court Advocates Association, urging it to defer for some more time the implementation of the Presidential notification for making the AP High Court functional at Amaravati from Jan 1, 2018.

ఆంధ్ర న్యాయవాదులకు చుక్కెదురు.. జోక్యం చేసుకోలేమన్న ‘సుప్రీం’..

Posted: 01/02/2019 12:39 PM IST
Sc says no to andhra hc advocates plea for time to shift from hyderabad

ఆంధ్ర న్యాయవాదులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టులో చుక్కెదురైంది. మరికోన్ని నెలల పాటు హైదరాబాదులోనే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును కొనసాగించాలని వారు దాఖలు చేసిన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మితమవుతున్న మరో హైకోర్టులో మౌలిక వసతుల కల్పన లేదని, అవి పూర్తయ్యే వరకు హైకోర్టును యధావిధిగా కొనసాగించాలని వారు పిటీషన్లో పేర్కోన్నారు.

అయితే రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసి జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కేటాయిస్తూ కూడా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అమరావతిలో నూతనంగా నిర్మితమవుతున్న హైకోర్టు ఇంకా పూర్తికాలేదని.. కాబట్టి కొన్ని నెలల పాటు హైదరాబాద్ హైకోర్టును ఉమ్మడి హైకోర్టుగానే కొనసాగించాలని అంధ్ర న్యాయవాదులు సంఘం పిటీషన్లో పేర్కోంది.

ఈ మేరకు ఇవాళ విచారణ సందర్భంగా ఆంధ్ర న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం వారి పిటీషన్ ను తోసిపుచ్చింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని ఆంధ్ర న్యాయవాదులను అదేశించిన న్యాయస్థానం.. నూతనంగా ప్రారంభం అవుతున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడనున్న విషయం సహజమని చెప్పింది. ఈ మరకు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టీస్ నజీర్ తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నెలపాడులో ఏపీ హైకోర్టు ప్రారంభమైపోయిందని, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తైయినందున ఈ పీటషన్ ను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయవాదులకు ఏమైనా సమస్యలు ఉంటే, ఏపీ ప్రభుత్వంతో చర్చించి, పరిష్కరించుకోవచ్చని, మరింత సమయం మాత్రం ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles