"What's The Rafale Secret In Manohar Parrikar's Bedroom?" రాఫెల్ పై పార్లమెంటులో రచ్చ.. జేపీసీకి విపక్షాల డిమాండ్

Paper planes in parliament rahul gandhi arun jaitley clash over rafale

Rahul Gandhi, Rafale deal, Lok Sabha, Arun Jaitley, Manohar parikar, rafale tape, congress, BJP, politics

The debate on Rafale jet fighter deal punctuated by two adjournments and deafening protests by AIADMK workers on the Cauvery issue -- saw a head-on collision between the government and the Congress in Lok Sabha.

రాఫెల్ పై పార్లమెంటులో రచ్చ.. జేపీసీకి విపక్షాల డిమాండ్

Posted: 01/02/2019 03:21 PM IST
Paper planes in parliament rahul gandhi arun jaitley clash over rafale

రాఫెల్ యుద్ద విమానాల అంశంపై మరోమారు పార్లమెంటులో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. రాఫెల్ డీల్ విషయంలో అంతా ఆయన బెడ్ రూంలోనే జరిగిందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికార ఎన్డీయేపై విరుచుకుపడ్డారు. రాఫెల్ డీల్ లో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని అరోపించిన ఆయన.. మాజీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పేరును ఊటంకించకుండా.. ఆయన మంత్రివర్గంలోని అరోగ్యశాఖ మంత్రితో జరిపిన సంబాషణల తాలుకు టేప్ ను పార్లమెంటులో బయటపెడతానని, అందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతి కావాలని కోరారు.

మనోహర్ పారికర్ పేరుతో ప్రచారం జరుగుతున్న ఆడియో టేపులను కృత్రిమంగా సృష్టించారని అరుణ్ జైట్లీ ఆరోపించారు. అలాంటి టేపులను సభలో ఎలా ప్రవేశపెడతారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో మీ సంతోషం కోసం తాను టేపులను బయటపెట్టనని, అయితే కేవలం టేపుల్లో వున్న విషయాన్ని చదివి వినిపిస్తానని చెప్పారు రాహుల్ గాంధీ. దానికి కూడా మంత్రి అభ్యంతరం తెలిపారు. ఆ టేపులను అధికారమని ధృవీకరించిన తరువాతే వాటిని చదవాలని ఆక్షేపించారు. దీంతో స్పీకర్ అనుమతించలేదు. అయినా రాహుల్ గాంధీ టేపు సారాంశాన్ని వినిపించే ప్రయత్నం చేయడంతో స్పీకర్ అభ్యంతరం తెలిపారు. అదే సమయంలో ఏఐఏడీఎంకే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో సభ ఐదు నిమిషాల పాటు వాయిదా పడింది.

మళ్లీ ప్రారంభమైన సభలో రాహుల్ గాంధీ తన జోరును కొనసాగిస్తూ రాఫెల్ డీల్ అంశంపై ప్రసంగించారు. 70 ఏళ్లుగా విమానాల తయారీలో అనుభవం ఉన్న హెచ్ఏఎల్ ను వదిలిపెట్టి, డీల్ కుదరడానికి పది రోజుల ముందు కంపెనీని నెలకొల్పిన అనిల్ అంబానీ సంస్థకు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. రాఫెల్ డీల్ మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్ మీద సుప్రీంకోర్టు తీర్పును కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. రాఫెల్ డీల్ మీద విచారణ జరపాల్సిన అవసరం లేదని చెప్పిందే కానీ, ఇందులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిన అవసరం లేదని కోర్టు అనలేదని రాహుల్ గాంధీ అన్నారు. నిజంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వెనుక ఏమీ లొసుగులు జరగకపోతే ప్రభుత్వం వెంటనే జేపీసీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

రాహుల్ ఆరోపణలపై అరుణ్ జైట్లీ ఘాటుగా బదులిచ్చారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు రాఫెల్ డీల్ మీద విచారణ అవసరం లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చిందని, ఈ తరుణంలో ఇక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి నిజాలు నచ్చవని, అబద్ధాలు మాత్రమే కావాలన్నారు. రాఫెల్ డీల్ మీద కూడా అసత్యాలను సృష్టిస్తున్నారని అరుణ్ జైట్లీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వారి కుటుంబం మాత్రమే కావాలని, జాతి భద్రత అవసరం లేదంటూ ఎదురుదాడికి దిగారు. రాహుల్ గాంధీకి నిజాలు అర్థం కావని, ఆయనకు డబ్బులు మాత్రమే అర్థం అవుతాయన్నారు. గత లోక్‌సభ సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ.. ఫ్రెంచ్ అధ్యక్షుడితో మాట్లాడానంటూ ఓ అబద్ధాన్ని ప్రచారం చేశారని, ఇప్పుడు మనోహర్ పారికర్ పేరుతో మరో అసత్యాన్ని సభ ముందుకు తెచ్చారని అరుణ్ జైట్లీ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Rafale deal  Lok Sabha  Arun Jaitley  Manohar parikar  rafale tape  congress  BJP  politics  

Other Articles