who are bindu and kanakadurga.? ఆ ఇద్దరికీ కేరళ ప్రభుత్వం రక్షణ కల్పించాలి: తృప్తిదేశాయ్

Trupti desai insits kerala govt for bindu and kanakadurga protection

sabarimala temple, sabarimala temple news, women enter sabarimala, trupti desai, bindi, kanakadurga, sabarimala temple case, sabarimala temple latest news, kerala sabarimala temple, kerala sabarimala temple news, kerala sabarimala temple today news, sabarimala temple issue, sabarimala issue, sabarimala, sabarimala news, sabarimala kerala, kerala sabarimala supreme court, sabarimala news, kerala, politics

Social activist Trupti Desai, who herself tried to visit the Sabarimala temple in November last year, said that the Kerala government should now protect the two women, as their names have been revealed and there could be a threat to their lives.

అయ్యప్పస్వామిని దర్శించుకున్న మహిళలు మలయాళీలే..

Posted: 01/02/2019 11:55 AM IST
Trupti desai insits kerala govt for bindu and kanakadurga protection

పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల అయప్పస్వామి దేవాలంయంలోకి రుతుస్రవం కలిగే వయస్సు గల మహిళలు బింధు, కనకదుర్గలు ప్రవేశించి.. స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం పట్ల భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తీ దేశాయ్ స్పందించారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా నారీ శక్తి ఏంటన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చిందని అమె వ్యాఖ్యానించారు. నెలన్నర క్రితం తాను చేయలేకపోయిన పనిని ఇద్దరు మహిళలు చేసి చూపించారని అమె వ్యాఖ్యానించారు.

దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఇద్దరు మహిళలను స్వామి సన్నిధికి పంపిన కేరళ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, అతి త్వరలో తాను కూడా ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటానని అన్నారు. మహిళల ప్రవేశంతో అనాదిగా వస్తున్న చాందస సంస్కృతి తుడిచిపెట్టుకుపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. వారి ప్రవేశం తరువాత గర్భగుడి తలుపులు మూసివేయడం, శుద్ధి చేయాలని నిర్ణయించడాన్ని ప్రశ్నించిన తృప్తీ దేశాయ్, ఇది యావత్ భారత మహిళలకే అవమానమని మండిపడ్డారు.

ఇదిలావుండగా, ఇవాళ వేకువజామున సుమారు మూడున్నర గంటలకు బింధు, కనకదుర్గలు శబరిగిరీశుడిని దర్శనం చేసుకున్న నేపథ్యంలో అసలు వీరు ఎవరు అన్న విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాల సంప్రదాయాన్ని, భక్తుల మనోభావాలను తోసిరాజుతూ ఆలయంలోకి వెళ్లిన వీరిద్దరూ గతంలో దర్శనానికి వచ్చి.. భక్తుల అందోళనకు జంకి వెనక్కుతిరిగి వెళ్లిన మహిళలే. నవంబర్ 24న ఆలయానికి వచ్చి, స్వామిని దర్శించకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోయిన 11 మంది మహిళల బృందంలో వీరూ ఉన్నారు.

మకరవిళక్కు సందర్భంగా డిసెంబర్ 30న ఆలయాన్ని తెరవగా, ఆపై రెండు రోజుల తరువాత భక్తుల సంఖ్య బాగా పలచబడటంతో వీరిద్దరూ వేకువ జామున పోలీసుల రక్షణ వలయంలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు. వారి కోరిక నెరవేరింది. కాగా బిందు వయసు 44 సంవత్సరాలు. సీపీఐ (ఎంఎల్) కార్యకర్తగా వ్యవహరిస్తూనే, ఓ కాలేజీలో లెక్చరర్ గా ఆమె పనిచేస్తున్నారు. కనకదుర్గ వయసు 42 సంవత్సరాలు కాగా, కేరళ ప్రభుత్వ పౌర సరఫరాల విభాగంలో ఈమె పనిచేస్తున్నారని పిటీఐ వివరాలను వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sabarimala  ayyappa swamy temple  trupti desai  bindi  kanakadurga  supreme court  politics  

Other Articles