Five held for abducting and raping woman in Manesar కదులుతున్న అటోలో మహిళపై గ్యాంగ్ రేప్

Woman gang raped by autorickshaw drivers in moving auto on gurugram s nh8

Delhi gangrape, woman gangraped, Delhi rape, raped auto, raped moving auto, woman raped Delhi, woman raped Gurgaon, Gurugram rape, New Delhi, sexual assault on woman, sexual assault on widow, nirbhaya incident in delhi, crime, delhi police

A 42-year-old woman was abducted and gang-raped by four autorickshaw drivers at a house in Gurugram's Bhangrola village before being taken by two other who raped her in a moving auto on NH8.

న్యూఇయర్ వేళ.. దేశరాజధానిలో దారుణం.. మహిళపై అటోడ్రైవర్ల అఘాయిత్యం

Posted: 01/02/2019 11:27 AM IST
Woman gang raped by autorickshaw drivers in moving auto on gurugram s nh8

దేశ రాజధానిలో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో ఫార్మ విద్యార్థినిపై జరిగిన ఘటనలో ఫాస్ట్ ట్రాకు కోర్టులు నిందితులకు శిక్ష ఖారురు చేసిన మానవమృగాలకు మాత్రం భయం, వణుకు కలగడం లేదు. ఏడేళ్ల క్రితం జరిగిన దారుణ ఘటనను యావత్ దేశం ఇంకా మరువక ముందే అలాంటి దారుణానికే ఒడిగట్టారు దేశరాజధానిలోని పైశాచిక మృగాలు. కదులుతున్న ఆటోలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కామాంధుల అఘాయిత్యం నేపథ్యంలో  సృహ కోల్పోయిన బాధితురాలిని ఓ దాబా పక్కనే పడేసి పరారయ్యారు. ఆరుగురు నిందితుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కదులుతున్న అటోలో అమెపై దారుణానికి ఒడిగట్టిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

యావత్ దేశం నూతన సంవత్సర సంబరాలకు సిద్దమవుతున్న వేళ.. గత ఏడాది చివరి రోజున మధ్యాహ్నం ఈ ఘటన ఢిల్లీలోని గుర్గావ్ లో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల మహిళ.. ఇటీవలే మరణించిన అమె భర్త పనిచేస్తున్న సంస్థకు వెళ్లి.. భర్త మరణానంతరం అమెకు రావాల్సిన డబ్బులను సెటిల్ చేసుకునేందుకు ఆటోను ఆశ్రయించింది. బాధితురాలు నఖ్ రోలా చౌక్ లో మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో ఆటో ఎక్కింది.

ఆమెను ఐఎంటీ-మనేసర్ కు తీసుకెళ్లాల్సిన ఆటో డ్రైవర్ అంకిత్ దారి మళ్లించి బాధితురాలిని మరో ఆటో డ్రైవర్ దీపక్ రూముకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే వున్న మరో ఇద్దరూ అటోడ్రైవర్లతో కలిసి  అమెపై వంతుల వారీగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 9 గంటలకు ఆమెను ఆటోలో తీసుకెళ్లిన నిందితులు బాధితురాలిని మరో ముగ్గురికి అప్పగించారు. వారందరూ కలిసి అదే ప్రాంతంలో ఆటోను తిప్పుతూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

పైశాచిక మృగాళ్ల దాడిలో నరకం అనుభించిన బాధితురాలు బాధను భరించలేక స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను రాంపురా ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న ఓ దాబా వద్ద పడేసి వెళ్లిపోయారు. స్పృహ కోల్పోయి పడి ఉన్న బాధితురాలిని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అటోలో బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles