Sabarimala Temple closed for ‘purification’ శబరిమల దేవాలయం మూసివేత.. సంప్రోక్షణ తరువాతే..

Sabarimala temple closed for purification after 2 women below 50 enter

sabarimala temple, sabarimala temple news, women enter sabarimala, sabarimala temple case, sabarimala temple latest news, kerala sabarimala temple, kerala sabarimala temple news, kerala sabarimala temple today news, sabarimala temple issue, sabarimala issue, sabarimala, sabarimala news, sabarimala kerala, kerala sabarimala supreme court, sabarimala news, kerala, politics

The Sabarimala temple has been closed on orders of the head priest for 'Shuddhi Kalasham (purification)', and reopened after 'purification' rituals, according to reports.

శబరిమల దేవాలయం మూసివేత.. సంప్రోక్షణ తరువాతే..

Posted: 01/02/2019 10:51 AM IST
Sabarimala temple closed for purification after 2 women below 50 enter

పవిత్ర పుణ్యక్షేత్రమైన శబరిమల అయప్పస్వామి దేవాలంయంలోకి నిషిద్ద వయస్సు గల మహిళలు వెళ్లడంపై కేరళ వ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబిక్కుతుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అదేశాల మేరకు తాము వ్యవహరించామని అటు కేరళ సర్కార్ చెబుతున్న క్రమంలో ఆలయ ఆచారాలకు విరుద్దంగా మహిళలను పోలీసులు ఎలా తీసుకెళ్తారంటూ భక్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల దేవాలయాన్ని ఆలయ ఆచార్యులు తాత్కాలికంగా మూసివేశారు.

అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన ఇద్దరు నిషిద్ద వయస్సుగల మహిళా భక్తులను పోలీసుల రక్షణలో దేవాలయంలోకి తీసుకెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేయించడంతో ఆలయం మైలపడిందని భక్తులతో పాటు ట్రావెన్ కోర్ ఆలయ బోర్డు కూడా భావించింది. ఈ క్రమంలో తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేసిన బోర్డు.. స్వామివారి పునర్ధర్శనం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తరువాతేనని స్పష్టం చేసింది. మండల పూజలు ముగిసి, మకరవిళక్కు పూజల కోసం స్వామి ఆలయాన్ని తెరచిన వేళ, మకర జ్యోతి దర్శనం వరకు దేవాలయం తెరచివున్న నేపథ్యంలో ఆలయ చరిత్రలో తొలిసారిగా దేవాలయాన్ని మరోమారు మూసివేసి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇవాళ వేకువజామున సుమారు మూడున్నర గంటలకు బింధు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళా భక్తులు అయప్ప స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. సుమారుగా పక్షం రోజుల పాటు ఆలయం తెరచివున్న క్రమంలో ఇవాళ ఉదయం తెరుచుకున్న దేవాలయం తలుపులు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో దేవాలయంలో భక్తుల రద్దీ తక్కువగా వుంది. దీనిని అసరాగా చేసుకున్న మహిళా భక్తులు దేవాలయంలోకి చేరుకుని స్వామివారిని దర్శించుకన్నారు. వీరికి పోలీసులు భారీ భద్రత నడుమ తీసుకెళ్లి.. అడ్డుకున్న భక్తులను బలవంతంగా చెదరగోట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sabarimala  ayyappa swamy temple  kerala cm  Pinarayi Vijayan. supreme court  politics  

Other Articles