telangana government to cash new year celebrations మద్యం ప్రియులకు కోసం.. న్యూఇయర్ రోజున..

Wine shops to open upto 12am on 31st december in telangana

TRS government, excise department, bars, wine shops, december 31, New Year celebrations 2019, GHMC, somesh kumar, districts, telangana, politics

The ruling TRS government in plan to encash new year eve, telangana excise department has issued ordres that liquor shops and bars will be open with extention of one hour additionally in telangana.

మద్యం ప్రియులకు కోసం.. న్యూఇయర్ రోజున..

Posted: 12/29/2018 12:47 PM IST
Wine shops to open upto 12am on 31st december in telangana

న్యూఇయర్ కి స్వాగతం పలుకుతూ.. పాత సంవత్సరాన్ని సాగనంపే క్రమంలో యువత చేసుకునే సంబరాలు అకాశాన్ని అంటుతాయి. దీనికి మద్యం కూడా తోడేతై ఇక వారి సంబరాలకు కొలమానమే వుండదు. ఓ వైపు పోలీసులు అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే సంబరాలను చేసుకోవాలని హెచ్చరిస్తున్న క్రమంలో మరోవైపు ఎక్సైజ్ శాఖ మాత్రం యువతను మద్యం దుకాణాల వైపు పురిగోల్పుతుంది. ఇక తమకు అవకాశం వున్న ప్రతీచోటా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటుంది.

అదెలాఅంటే.. న్యూఇయర్ సంబరాల్లో యువత అధికంగా తమ స్నేహితులతో కలసి జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మద్యం అలావాటు లేని యువత కూడా మధ్యం అలవాటు చేసుకుంటారు. కొత్త ఏడాది జోష్ లో తాగేసి, తినేసి, సంబరాలు చేసుకునే యువతతో పాటు మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ బంపరాఫర్ ప్రకటించింది. డిసెంబరు 31 రాత్రి అదనంగా మరో గంటపాటు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు జరుపుతుండగా, బార్లు మాత్రం రాత్రి 12 గంటల వరకు తెరచి వుంటాయి. ఇక అదే జిల్లాల్లో రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలు తెరచివుండగా, బార్లు మాత్రం రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు సాగిస్తాయి. ఎక్సైజ్ శాఖ తాజా అదేశాలతో డిసెంబర్ 31న మాత్రం వైన్ షాప్‌లు మరో గంట అదనంగా తెరిచే ఉంటాయి. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అర్ధరాత్రి 12 గంటల వరకు, జిల్లాల్లో రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలకు అమ్మకాలు సాగించవచ్చు.

ఇక, బార్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్, పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్‌ల్లో మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుతారు. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించేవారు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ ఇటీవలే తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకు అదనంగా కొంత మొత్తం చెల్లించాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.9వేలు, జిల్లాల్లో రూ.6వేల ఫీజు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles