Girls Punished with Chilli Powder in Their Private Parts షెల్టర్ హోమ్ లో చిన్నారి బాలికలపై దారుణాలు..

Delhi shelter home girls abused punished with chilli powder in their private parts

DCW, DCW chief, delhi, Delhi Shelter home, Swati Maliwal, young girls punished at shelter homes, dwaraka shelter home

During an inspection of Dwarka shelter homes in Delhi, an expert committee set up by the Delhi Commission for Women (DCW) found that girls were allegedly abused by its staff, which often put chilli powder in their private parts to discipline them.

షెల్టర్ హోమ్ లో చిన్నారి బాలికలపై దారుణాలు.. ఢిల్లీలో ఘటన

Posted: 12/29/2018 12:11 PM IST
Delhi shelter home girls abused punished with chilli powder in their private parts

దారితెన్ను తెలియని చిన్నారి బాలికల భవిష్యత్తు మొగ్గల్లోనే వాడిపోకూడదని, వారిని సంరక్షించి.. ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం నడుపుతున్న షెల్టర్ హోమ్ లలో వారు అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కోంటున్నారు. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని బాలికల షెల్టర్ హోమ్ లో వెలుగు చూసిన దారుణాలు అక్కడకు ఇన్స్ పెక్షన్ కోసం వెళ్లిన వారికి కూడా కన్నీళ్లు తెప్పించాయి. ఇంత దారుణంగా బాలికల షెల్టర్ హోమ్ లను నిర్వహిస్తారా.? ఇంత కఠినంగా శిక్షలు ఎలా వేస్తారు.? కనీసం వారికి మనుషులుగా కూడా పరిగణలోకి తీసుకోకుండా కట్టుబాసినల మాదిరిగా వ్యవహరిస్తారా.? అన్న ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి.

జాతీయ మహిళా కమీషన్ ఆద్వర్యంలోని ఓ కమిటీ రోటీన్ బాలికల షెల్టర్ హోమ్ లను తనిఖీలలో భాగంగా బాలికలు ఆశ్రయం పొందుతున్న ఢిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన షెల్టర్ హోమ్ కు చేరుకుని అక్కడి వసుతులు ఎలా వున్నాయన్న విషయాన్న పరిశీలించింది. ఈ సందర్బంగా అక్కడ ఆశ్రయం పోందుతున్న బాలికలతో మాట్లాడితూ.. వారికి సమకూరుతున్న సౌకర్యాల గురించి అరా తీసింది. అయితే వారి వివరాల సంగ్రహణలో పలు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. వాటిని విన్న ఢిల్లీ మహిళా సంఘం సభ్యుల కమిటీ తీవ్రంగా చలించిపోయారు.

షెల్టర్ హోమ్‌లోకి కొందరు మహిళా ఉద్యోగులు తాము చెప్పినట్టు వినడం లేదనే కారణంగా తమ మర్మంగాల్లో కారంపొడి పెట్టి హింసించారని బాలికలు గోడు వెల్లబోసుకున్నారు. కొన్నిసార్లు తమతో బలవంతంగా కారం తినిపించారని విలపించారు. షెల్టర్ హోమ్‌లో సిబ్బంది తక్కువగా ఉండటం కారణంగా ఇల్లు ఊడవడం, బట్ట ఉతకడం, టాయిలెట్లు శుభ్రం చేయించడం వంటి పనులను కూడా తమతోనే చేయించేవారని కొందరు బాలికలు కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని వారికి ఫిర్యాదు చేశారు.

సిబ్బంది చెప్పినట్టుగా వినకపోతే తమను స్కేల్స్‌తో కొట్టేవారని... తమను ఇంటికి కూడా పంపించేవారు కాదని బాలికలు కమిషన్ సభ్యుల ముందు వాపోయారు. దీనిపై వివరాలు తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. షెల్టర్ హోమ్‌కు పోలీస్ ఉన్నతాధికారిని పిలిపించి బాలికలతో స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఉదయం వరకు షెల్టర్ హోమ్‌లోనే ఉండి కమిషన్ సభ్యులతో చర్చించారు. ఇలాంటి షెల్టర్ హోమ్స్‌లో పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వంలో చర్చించాలని ఢిల్లీ మహిళా కమిషన్ నిర్ణయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles